Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ కొరఢా.. ఆ కలెక్టర్లు - ఎస్పీల మార్పు ఖాయమా?
By: Tupaki Desk | 22 Jan 2021 3:37 PM GMTఏపీ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోరు పెంచారు. తాజాగా శనివారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ కు తాజాగా లేఖ రాశాడు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు.
చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీతోపాటు పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు , రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ లేఖలో కోరారు.
గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ 9 మంది అధికారులు అలసత్వం ప్రదర్శించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని తాను అప్పుడే లేఖ రాశానని నిమ్మగడ్డ గుర్తు చేశారు. అయితే వీరిని తొలగించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరిని వెంటనే రేపటి నుంచి తొలగించాలని సూచించారు. ఆయా స్థానాల్లో ముగ్గురి చొప్పున పేర్లు ప్రతిపాదించాలని సీఎస్, డీజీపీలను లేఖలో ఎస్ఈసీ కోరారు.
అయితే జగన్ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. సుప్రీంకోర్టులో కూడా తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా వస్తే ఇక నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది.