Begin typing your search above and press return to search.
సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ!!?
By: Tupaki Desk | 30 July 2019 8:26 AM GMTప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సెర్బియా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం జరిగి రెండు రోజులు గడిచిన తర్వాత ఆలస్యంగా తెలియడం గమనార్హం. కుటుంబంతో సహా సెర్బియాకు విహార యాత్రకు వెళ్లారు నిమ్మగడ్డ. మ్యాట్రిక్ సంస్థ పేరుతో ప్రసాద్ వ్యాపారాలు నిర్వహించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. అయితే, ఆయన వాన్ పిక్ వ్యవహారానికి సంబంధించిన వాటాల విషయంలో తమను ప్రసాద్ మోసం చేశారని ఆరోపిస్తూ రస్ అల్ ఖైమా గతంలో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉంది.
దీనిని విచారిస్తున్న సెర్బియా పోలీసులు ఉరుములు లేని పిడుగు మాదిరిగా తమ దేశానికి పర్యటనకు వచ్చిన ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, సెర్బియా రాజధాని బిల్ గ్రేడ్ లో నిమ్మగడ్డను అక్కడి పోలీసులు విచారిస్తున్నారని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాలో ఈ టాపిక్ హాట్ గా మారింది. ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ చంచల్ గూడ జైల్లో కొన్నాళ్లపాటు విచారణ ఖైదీగా ఉన్నారు. అనంతరంపై బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. అటు టాలీవుడ్ తోనూ అత్యంత సన్నిహిత సంబందాలు ఉన్న నిమ్మగడ్డకు అక్కినేని నాగార్జున కూడా బెస్ట్ ఫ్రెండ్ కావడం విశేషం.
భారీ స్థాయి వ్యాపార వేత్తలకు ఇలాంటి విచారణలు అరుదేం కాదు. ప్రతి సంస్థ ఏవో కేసులు ఎదుర్కోవడం సహజమే. ఇపుడు ఆయనను అందుపులోకి తీసుకున్న కేసు కూడా కొత్తది ఏం కాదు. దీనిపై భారతీయ విదేశాంగ శాఖకు సమాచారం అందింది. వారు మరిన్ని వివరాలకై ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అయినా, ఇంకెవరైనా తన దేశ పౌరుడిని ఇతర దేశంలో విచారణ జరిగినా - అరెస్టు చేసినా... దాని సమాచారాన్ని కేంద్రం సేకరిస్తుంది. మన పౌరుల తప్పులేకుంటే సహాయమూ అందిస్తుంది.