Begin typing your search above and press return to search.
ఆ న్యూస్ చానెల్ దక్కించుకున్న నిమ్మగడ్డ?
By: Tupaki Desk | 26 July 2018 10:21 AM GMTప్రముఖ పారిశ్రామిక వేత్త, మ్యాట్రిక్స్ గ్రూప్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. 2000 సంవత్సరంలో నష్టాల్లో ఉన్న ఓ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసిన ప్రసాద్....దానిని లాభాల బాట పట్టేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన ఈ వ్యాపారవేత్త....2006లో మా టీవీని స్థాపించారు. అనతి కాలంలోనే ఆ చానెల్ కు విపరీతమైనా పాపులారిటీ వచ్చేలా వినూత్నమైన కార్యక్రమాలను అందించారు. ఆ తర్వాత 2015లో....2500 కోట్ల రూపాయలకు మా టీవీని స్టార్ గ్రూపునకు అమ్మేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, నిమ్మగడ్డ ప్రసాద్...10 టీవీ న్యూస్ చానెల్ ను కొన్నట్లు వెబ్ - సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 32 కోట్ల ధరకు ఆ చానెల్ ను ప్రసాద్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
టెన్ టీవీని ప్రసాద్ కొనుగోలు చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ డీల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ చానెల్ ...జనసేనకు మద్దతివ్వబోతోందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి ప్రసాద్ అత్యంత సన్నిహితుడు కావడంతో....10 టీవీలో చిరుకు కూడా వాటా ఉందని పుకార్లు వస్తున్నాయి. మరో ఏడాదిలో మా టీవీ తరహాలోనే...ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ను కూడా ప్రసాద్ స్టార్ట్ చేయబోతున్నారట. స్టార్ తో ఉన్న ఒప్పందం ప్రకారం.....మా టీవీని అమ్మిన మూడేళ్ల వరకు ప్రసాద్ కొత్త ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ప్రారంభించకూడదు. అందుకే, 2019 ప్రారంభంలో ఓ సరికొత్త చానెల్ తో ప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రావాలని యోచిస్తున్నారట. అయితే, ఈ విషయాలపై ప్రసాద్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.