Begin typing your search above and press return to search.
హైకోర్టు లో దాఖలు చేసిన నిమ్మగడ్డ కౌంటర్లలో ఏముంది?
By: Tupaki Desk | 28 April 2020 4:30 AM GMTఏపీ ప్రభుత్వానికి.. ఏపీ ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య నడుస్తున్న లొల్లి గురించి తెలిసిందే. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా హైకోర్టు లో తన కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పై ఆయన పలు విమర్శలు.. ఆరోపణలు చేశారు. తనపై ఏపీ ప్రభుత్వం చేసిన వాదనల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన వేర్వేరు కౌంటర్లలో ఏమేం అంశాలు ఉన్నాయన్నది చూస్తే..
% గత ఫిబ్రవరి, ఏ ప్రిల్ లలో జారీ చేసిన రెండు ఆర్డినెన్స్‌లు ఎన్నికల సంస్కరణల కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. స్వీయ ప్రయోజనాల కోసమే వాటిని తీసుకొచ్చింది.
% ఫిబ్రవరి 20న తెచ్చిన తొలి ఆర్డినెన్స్ సందర్భంలో ఎన్నికల సంఘాన్ని కనీసం సంప్రదించలేదు. ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘంతో చర్చించాలి. ఆ పని ప్రభుత్వం చేయలేదు.
% ఆ ఆర్డినెన్స్‌లో నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థి దాఖలు చేసుకునే అప్పీల్ పరిష్కారం కోసం తగిన సమయం ఇవ్వలేదు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశా. మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినట్లు భావించలేము. అసాధారణ స్థాయిలో సీట్లు ఏకగ్రీవం కావడమే ఇందుకు ఉదాహరణ.
% 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 16, 589 సీట్లకు గాను 346 ఏకగ్రీవం కాగా.. ఇప్పుడు 9,696కు 2362 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 2014లో ఏకగ్రీవ శాతం రెండుగా ఉంటే.. ఈసారి 24 శాతంగా ఉంది.
% 2014లో 1096 స్థానాలకు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక స్థానం ఏకగ్రీవమైంది. తాజాగా 652 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళలో 126 చోట్ల ఏకగ్రీవమయ్యాయి.
% కడప జిల్లాలో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అక్కడ 553 ఎంపీటీసీ స్థానాలకు గాను 439, జడ్పీటీసీల్లో 50కి 38 ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీల్లో 79 శాతం, జడ్పీటీసీల్లో 76శాతం ఏకగ్రీవమయ్యాయి.
% 2014 స్థానిక ఎన్నికల్లో కంటే ఈ ఏడాది హింసాత్మక ఘటనలు తక్కువ జరిగాయని చెప్పడం తప్పు. ఎన్నికలు పూర్తి కాకుండానే 2014ఎన్నికల హింసాత్మక ఘటనలతో పోల్చి చూడటం సరికాదు. ఈ సారి స్థానిక ఎన్నికల్లో మొత్తం 55 హింసాత్మక ఘటనలు జరగ్గా, 35 చోట్ల నామినేషన్లు అడ్డుకున్నారు. 25 చోట్ల బలవంతంగా ప్రత్యర్థులతో ఉపసంహరింపజేయించారు.
% మీడియాలో వచ్చిన ఘటనలపై కమిషన్ పరిశీలించే తగిన విధంగా స్పందించింది. అందుకే నన్ను పదవి నుంచి తొలగించేందుకే రెండో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత రహస్యమైనది. న్యాయ సలహా మేరకే నడచుకున్నా.
% ఎన్నికల వాయిదా నిర్ణయంపై ప్రభుత్వాధికారులనో, ఎన్నికల సంఘ కార్యదర్శినో సంప్రదించాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గ నిబంధనలు లేవు. సంస్కరణల కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్వాగతించతగినదని ఎన్నిల కమిషన్ కార్యదర్శి చెప్పటం.. బాధ్యతరహితమైన ప్రకటనగా పరిగణించాలి.