Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ తాజా ఫోకస్.. ఆ సమాచారంతో రమ్మంటూ ఆదేశాలు

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:56 AM GMT
నిమ్మగడ్డ తాజా ఫోకస్.. ఆ సమాచారంతో రమ్మంటూ ఆదేశాలు
X
ఏది ఏమైనా ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అనుకున్నది పూర్తి చేశారు. ప్రభుత్వానికి సుతారం ఇష్టం లేకున్నా.. కోర్టుల్లో పోరాడి మరీ ఎన్నికల్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో ఎన్నికల నిర్వహణకు నో చెప్పిన ప్రభుత్వం.. రకరకాలైన ప్లాన్లు వేసింది.చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. అనుకున్నట్లే.. పంచాయితీ ఎన్నికల్ని పూర్తి చేశారు నిమ్మగడ్డ.

ఇప్పుడు ఆయన ఫోకస్ మున్సిపాలిటీల మీద పడింది. దీనికి సంబంధించిన కీలక రివ్యూ సమావేశాన్ని ఈ రోజు (సోమవారం) నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. డీజీపీ.. జిల్లా కలెక్టర్లు.. జిల్లా ఎస్పీలతో పాటుపోలీస్ కమిషనర్లు.. మున్సిపల్ కమిషనర్లు అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.

సమావేశాలకు వచ్చే అధికారులు తమ వెంట పూర్తి సమాచారంతో రావాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్నిత్వరగా పూర్తి చేసి.. ఆ వెంటనే ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తన పదవీ కాలం పూర్తి అయ్యే నాటికి ఏపీలో నిర్వహించాల్సిన అన్ని స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలన్నదే నిమ్మగడ్డ వారి లక్ష్యమని చెబుతున్నారు.

పంచాయితీ ఎన్నికల్లో సాధించిన విజయాలతోమాంచి ఊపు మీద ఉన్న అధికారపక్షం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. పనిలో పనిగా అన్ని ఎన్నికల్నిపూర్తి చేసేస్తే.. తమ అధిక్యత స్పష్టంగా వెల్లడవుతుందన్న నమ్మకానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ వారు కోరినట్లుగా అధికారులు పూర్తి సమాచారంతో వస్తారా? అన్నది చిన్నప్రశ్నగా ఉంది.