Begin typing your search above and press return to search.
ఎన్నికల నిర్వహణపై తొందరలోనే సీఎస్ తో సమావేశం
By: Tupaki Desk | 28 Oct 2020 4:10 PM GMTఅర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో తొందరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ సమావేశమవబోతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వ అభిప్రాయం కోరేందుకు ప్రధాన కార్యదర్శితో తొందరలోనే స్టేట్ ఎలక్షన్ కమీషన్ సమావేశమవబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ విషయంలోనే అభిప్రాయాలు సేకరించేందుకు బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయిన విషయం తెలిసిందే.
అధికార వైసీపీ సమావేశానికి గైర్హాజరైనా మిగిలిన 18 పార్టీలు హాజరయ్యాయి. సమావేశానికి హాజరైన పార్టీల్లో టీడీపీ, బీజేపీ, సీపీఐ, బిఎస్పీ తదితర పార్టీలు ఎన్నికలను నిర్వహిస్తే తాము పాల్గొంటామని చెప్పాయి. అలాగే వాయిదా పడేనాటికి ఏకగ్రీవమని ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. పార్టీలు ఇటువంటి డిమాండ్లు చేస్తాయన్న విషయాన్ని వైసీపీతో పాటు చాలామంది ఊహించిందే. ఇటువంటి డిమాండ్లు చేస్తాయని వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు ముందే చెప్పారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్ధితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో చర్చించినట్లు కూడా ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. మరి ఇదే నిజమైతే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఎలక్షన్ కమీషన్ అధికారులు ఎప్పుడు చర్చించారో చెప్పలేదు. అలాగే కరోనా సమస్యపై వైద్యారోగ్య శాఖ అధికారులు ఏమని చెప్పారో కూడా చెప్పలేదు.
చివరగా తమను ఉద్దేశిస్తు వైసీపీ ఇచ్చిన ప్రెస్ నోటును చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. ప్రెస్ నోటులో ఏముంది ? ఏ ఏ అంశాలను చూసి ఎన్నికల కమీషన్ ఆశ్చర్యపోయందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అలాటే తాము నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో పార్టీలు చెప్పిన అభిప్రాయాలేమిటో కూడా ఎన్నికల సంఘం వివరించలేదు.