Begin typing your search above and press return to search.
ప్రభుత్వంతో వివాదాన్నే కోరుకుంటున్నారా ?
By: Tupaki Desk | 4 Feb 2021 5:30 PM GMTస్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. ఇదే సమయంలో ఆయన మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేవిధంగానే ఉంటోంది. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలను చివరి నిముషం వరకు వాయిదా వేయించేందుకే ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నించారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించటానికి నిమ్మగడ్డ ఒంగోలులో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు.
సుప్రింకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు ఏర్పాటు చేసింది. మొదటిదశ పంచాయితీ ఎన్నికల నామినేషన్లు కూడా అయిపోయాయి. ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. తొందరలోనే రెండో ఫేజ్ నామినేషన్లు మొదలవ్వబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వంలోని పెద్దలు చివరి నిముషం వరకు ప్రయత్నించారని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ కూడా చాలా కేసులే వేశారు.
ఎన్నికలు వద్దని హైకోర్టులోని సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత మరి నిమ్మగడ్డ డివిజన్ బెంచ్ కు ఎందుకు వెళ్ళినట్లు ? ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలన్న పంతంతోనే కదా. మరి ఇదే విధమైన పంతం ప్రభుత్వానికి ఉండటం తప్పెలాగ అవుతుంది. అంటే ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తప్పయితే ఎలాగైనా నిర్వహించాలన్న నిమ్మగడ్డ ప్రయత్నాలు కూడా తప్పే కదా.
సుప్రింకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నపుడు పాత విషయాలను కెలుక్కోవాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఎందుకొచ్చింది ? చూస్తుంటే ప్రభుత్వంతో నిమ్మగడ్డ వివాదాలనే కోరుకుంటున్నట్లుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒక మాటని తర్వాత వైసీపీ నేతలతో పదిమాటలు అనిపించుకోవటం నిమ్మగడ్డకు అలవాటుగా మారిపోయింది. ఒకవైపు తాను ఎవరితోను వివాదాలను కోరుకోవటం లేదని చెబుతునే ప్రభుత్వంపై అనవసరమైన వ్యాఖ్యలు చేయటం నిమ్మగడ్డకే చెల్లింది.