Begin typing your search above and press return to search.

'టార్గెట్ పెద్దిరెడ్డే' నా అసలు వ్యూహం

By:  Tupaki Desk   |   7 Feb 2021 7:45 AM GMT
టార్గెట్ పెద్దిరెడ్డే నా అసలు వ్యూహం
X
కొంతకాలంగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై డైరెక్టుగానే ఆరోపణలు - విమర్శలు చేస్తున్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ అయ్యారా ? మంత్రులు - వైసీపీ ఎంఎల్ ఏలు అలాగే అనుమానిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత నిమ్మగడ్డదే. తన బాధ్యతలు నిర్వర్తించటంతో కమీషనర్ ఫెయిలయ్యారన్నది వాస్తవం.

చంద్రబాబునాయుడు హయాంలోనే ఎప్పుడో 2018లో నిర్వహించాల్సిన ఎన్నికలను విషయాన్ని నిమ్మగడ్డ అప్పట్లో గాలికొదిలేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ఎన్నికల నిర్వహణ మొదటినుండి వివాదాస్పదమవుతునే ఉంది. ఈ నేపధ్యంలోనే నిమ్మగడ్డను మంత్రి పెద్దిరెడ్డి డైరెక్టుగానే ఎటాక్ చేస్తున్నారు. పైగా ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా పెద్దిరెడ్డి వాయించేస్తున్నారు.

ఇటువంటి అనేక కారణాలతో కమీషనర్ మంత్రిపై బాగా కోపంతో ఉన్నారు. దీనికితోడు పెద్దిరెడ్డితో పాటు బొత్సా సత్యనారాయణపై గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన దగ్గర నుండి మంత్రి మరింతగా రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డపై మంత్రి ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేయటం - కమిటి విచారణ జరపటం అందరికీ తెలిసిందే. ప్రివిలేజ్ కమిటి సిఫారసుపైన స్పీకర్ సీరియస్ అయితే నిమ్మగడ్డపై సివియర్ యాక్షన్ ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇటువంటి అనేక వివాదాల మధ్య చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలైన 110 పంచాయితీల ఫలితాలు ప్రకటించకుండా నిమ్మగడ్డ నిలిపేశారు. దానిపై మంత్రితో రెచ్చిపోయారు. దాంతో మంత్రిని ఈనెల 21వ తేదీ వరకు హౌస్ అరెస్టు చేయాలని - మీడియాతో మాట్లాడకుండా నియంత్రించాలని నిమ్మగడ్డ డీజీపీని ఆదేశించారు. మంత్రిపై యాక్షన్ తీసుకునే అధికారం నిమ్మగడ్డకు ఉందా ? అనేది ప్రశ్న. లేదని మంత్రితో పాటు ప్రభుత్వం కూడా వాదిస్తోంది. ఇదే విషయమై కోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేసింది. జరుగుతున్నదంతా చూస్తుంటే పెద్దిరెడ్డిని నిమ్మగడ్డ టార్గెట్ చేశారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తనపై పెద్దిరెడ్డి డైరెక్టుగా విరుచుకుపడిపోతుండటం పైగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి కూడా కావటాన్ని నిమ్మగడ్డ సహించలేకపోతున్నట్లున్నారు. ఎట్టిపరిస్దితుల్లోను పంచాయితి ఎన్నికల్లో ఏకగ్రీవాలయ్యేందుకు లేదని ఎంత చెప్పినా చిత్తూరు జిల్లాలో ఏకంగా 110 పంచాయితీలు ఏకగ్రీవాలవ్వటాన్ని నిమ్మగడ్డ తట్టుకోలేక పోతున్నట్లున్నారు. ఏకగ్రీవాలన్నీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే అయినట్లుగా నిమ్మగడ్డ అనుమానిస్తున్నారు. అందుకనే ఎలాగైనా పెద్దిరెడ్డిని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే టార్గెట్ చేసి 21వ వరకు హౌస్ అరెస్టుకు ఆదేశాలిచ్చారు.