Begin typing your search above and press return to search.
ప్రివిలేజ్ నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ!!
By: Tupaki Desk | 19 March 2021 1:40 PM GMTప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసుపై ఎస్.ఈ.సీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ ఎమ్మెల్యేలపై అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.తాను ఎవరిని అవమానించలేదని స్పష్టం చేశారు. నాకు నోటీసు ఇచ్చే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తేల్చిచెప్పారు.. కరోనా టీకా తీసుకున్నా.. భౌతికంగా ప్రయాణించే పరిస్థితిలో లేనని.. ఈ అంశంపై ముందుకెళ్లాలనుకుంటే ఆధారాలతో సరైన సమయంలో స్పందిస్తానని నిమ్మగడ్డ తెలిపారు.
ఈ క్రమంలోనే మంత్రులు పంపించిన ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై కూడా నిమ్మగడ్డ స్పందించారు. 'తాను ఎవరి హక్కులకు భంగం కలిగించలేదు' అని స్పష్టం చేశారు.పంచాయతీ ఎన్నికల సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీ నిమ్మగడ్డకి నోటీసులు జారీ చేసింది.
గతంలో ఏపీ సర్కార్ తో ఢీకొన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్... తమను అవమానించారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ వారు నాడు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ.. వర్చువల్ ద్వారా భేటీ అయి దీనిపై చర్చించింది. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే సభా కమిటీ చర్చించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తాజాగా స్పందిస్తూ నాకు నోటీసులు ఇచ్చే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదని స్పష్టం చేశారు.