Begin typing your search above and press return to search.

టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

By:  Tupaki Desk   |   31 Jan 2021 2:30 AM GMT
టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!
X
చంద్రబాబు హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకమయ్యారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. సహజంగానే ఈయన వైసీపీ ప్రభుత్వంపై ఇప్పుడు దండెత్తుతున్నారు. ఈయనను తొలగించాలని సీఎం జగన్ ప్రయత్నం లేదు.. తొక్కని కోర్టు లేదు. అన్నింట్లోనూ నిమ్మగడ్డకే ఎడ్జ్ లభించింది.

పంచాయితీ ఎన్నికల సాక్షిగా జగన్ ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య ఎంతటి యుద్ధం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయి. ఇప్పటికీ వైసీపీ మంత్రులు నిమ్మగడ్డపై దుమ్మెత్తిపోస్తున్నారు.ఇంతటి హీట్ లో టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా అనుకోని ట్విస్ట్ నెలకొంది. వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న నిమ్మగడ్డ తాజాగా చంద్రబాబుకి షాక్ ఇచ్చారు.

తాజాగా టీడీపీకి నోటీసులు జారీ చేశారు నిమ్మగడ్డ రమేశ్. గ్రామ పంచాయితీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీ ఫిర్యాదుపై నిమ్మగడ్డ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి రెండో తేదిలోపు వివరణ ఇవ్వాలని కోరారు. పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని.. వైసీపీ ఫిర్యాదు మేరకు నోటీసులు ఇస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.ఇక వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నిమ్మగడ్డ ఏకంగా చంద్రబాబుకు స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాాంశమైంది.