Begin typing your search above and press return to search.
రావణాసుడే రామాయణం చెప్తే ఎలా..జగన్ పై నిమ్మల!
By: Tupaki Desk | 27 Jan 2020 12:38 PM GMTగత కొద్దిరోజులుగా ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం జగన ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని ప్రకటించడం తో మొదలైన రచ్చ నేడు మండలి రద్దు వరకు అలాగే కొనసాగుతోంది. అసలు మొన్నటివరకు మండలి పై ఎటువంటి ప్రకటన కూడా కానీ, తాజాగా సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ లో ప్రవేశపెట్టి ..ఆమోదం తెలిపారు. దీనిపై టీడీపీ నేత నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
సీఎం జగన్ విలువలు - విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.. రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లు ఉంది అని నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. కూచిపూడి నాట్యకారిణిలా మడమా తిప్పుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ వ్యవస్థల్ని మర్డర్ చేయడంలో సిద్ధహస్తులని - మండలిని రద్దు చేయడం అంటే ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీల మీద దాడి చేయడమేనని రామానాయుడు తప్పుబట్టారు. ఉద్యోగసంఘాల గొంతు మండలిలో వినిపించే అవకాశం లేకుండా చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.
రజక - ఈడిగ - యాదవ - శెట్టిబలిజ లాంటి వెనుకబడిన కులాల ప్రతినిధులంతా మండలిలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్ని కులాల వారికి అన్యాయం జరుగుతుంది అని తెలిపారు. 58 మందితో సగానికిపైగా బడుగు - బలహీనవర్గాలతో నిండిన మండలిని రద్దు చేయడమంటే వాళ్ల గొంతునొక్కడమేనని రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ కు భవిష్యత్ లో బీసీలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.సీఎం జగన్ మండలిని దుబారా ఖర్చు అంటూ రద్దు చేస్తున్నాం అని చెప్తున్నారని , కేబినెట్ ర్యాంక్ ఉన్న 23 మందిని సలహాదారులుగా నియమించుకున్న సీఎం జగన్ దుబారా గురించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేసారు.