Begin typing your search above and press return to search.

చంద్రబాబును చంపేస్తారేమో : జగన్ మీద తీవ్ర విమర్శ

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:48 PM GMT
చంద్రబాబును చంపేస్తారేమో :  జగన్ మీద తీవ్ర విమర్శ
X
చంద్రబాబు అంటే ఆషామాషీ మనిషి కాదు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ఇక కేంద్ర భద్రతా వలయంలో ఆయన ఎపుడూ ఉంటారు. అలాంటి చంద్రబాబుని చంపడం ఎవరి తరం. కానీ ఇందిరాగాంధీని, రాజీవ్ ని చంపిన దేశం, దానికంటే ముందు మహాత్ముని బలి కొన్న దేశం కూడా ఇదే. అందువల్ల భద్రత ఎంత ఉన్నా ఏమరుపాటుగా ఎవరూ ఉండరాదు. అయితే చంద్రబాబుని చంపడం అన్నది జరుగుతుందా. అసలు ఇంతకంటే తీవ్ర ఆరోపణ ఉంటుందా.

జగన్ సర్కార్ బాబుని మట్టుపెడుతుంది అంటున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఆయన జగన్ మీద అనేక సంచలన ఆరోపణలు కూడా చేశారు. జగన్ తన సొంత బాబాయ్ నే హత్య చేయించారు అని ఘాటైన కామెంట్స్ చేశారు. తల్లి, చెల్లెలు కూడా వైసీపీని వీడిపోయేట్టుగా చేసిన జగన్ కి బాబు అంటే ఎంత అని ఆయన లాజిక్ పాయింట్ లాగి మరీ చెప్పుకొచ్చారు.

ఏపీలో వైసీపీది అరాచక పాలన అని ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నగా సాగుతోంది అని ఆయన మండిపడ్డారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోతారని కూడా జోస్యం చెప్పారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అంటూ కూడా శాపనార్ధాలు పెట్టారు. దేశమంతా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉంటే ఏపీలో మాత్రం జగన్ పోలీస్ సర్వీస్ ఉందా అని నిమ్మల సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే వైసీపీ అడ్డుకోవడమేంటి అని ప్రశ్నించారు. విపక్ష నేత తిరగకూడదా అని మండిపడ్డారు. కుప్పంలో అల్లర్లు అంటూ టీడీపీ వారినే అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ వారి మీద ఒక్క కేసూ ఎందుకు పెట్టలేదని ఆయన పాయింట్ రైజ్ చేశారు. ఏపీలో వారిలో రాజ్యాంగం టీడీపీకో రాజ్యాంగం అమలవుతోందా అని నిగ్గదీశారు.

ఏపీలో ఎపుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలుస్తుంది అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని నిమ్మల పేర్కొన్నారు. జగన్ చేయించుకున్న సొంత సర్వేలలో కూడా వైసీపీ ఓడిపోతుంది అని వచ్చిందని అందుకే అరాచకాలకు తెర తీశారని అన్నారు. వైసీపీకి ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిందని, దాన్ని పూడ్చుకోవడం కష్టమని కూడా నిమ్మల చెప్పేశారు.

ఈ ఆరోపణలు సంగతిఎలా ఉన్నా చంద్రబాబుకి వైసీపీ సర్కార్ లో ప్రాణ హాని ఉంది అంటూ ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం మాత్రం సంచలనమే అనుకోవాలి. పైగా వైసీపీ సర్కార్ కి ఇది డెడ్ ఈజీ అని కూడా ఆయనే చెబుతున్నారు అంటే జగన్ రాజకీయ జీవితంలో ఇంతకంటే అతి పెద్ద ఆరోపణ మరోటి ఉండదు.

దీనిని బట్టి అధికార పార్టీ జాగ్రత్తపడాలని కూడా అంటున్నారు. విపక్ష నేతలను కట్టడి చేయడం అరెస్టులు చేయడం, వైసీపీ వారిని ఎగదోసి టీడీపీ నేతల మీద దాడులు చేయించడం వంటివి చేస్తూ పోతే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలను చివరికి జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అపుడు నెత్తీ నోరూ బాదుకున్నా ప్రయోజనం మాత్రం ఉండదంతే.