Begin typing your search above and press return to search.

అపోలో ఆస్పత్రిలో నిమ్స్ డైరెక్టర్ కు చికిత్సనా..? విమర్శల వాన

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:11 AM GMT
అపోలో ఆస్పత్రిలో నిమ్స్ డైరెక్టర్ కు చికిత్సనా..? విమర్శల వాన
X
తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్పత్రి నిమ్స్. ఈ నిమ్స్ లో ఉద్యమ సమయంలో కేసీఆర్ నుంచి మొదలుపెడితే లగడపాటి రాజగోపాల్ రెడ్డి వరకూ అందరూ చికిత్స తీసుకున్నవారే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ఆపరేషన్లు, క్లిష్టమైనవి.. పేదలకు ఉచితంగా అందిస్తూ కల్పతరువుగా నిమ్స్ పేరొందింది. అయితే తాజాగా నిమ్స్ డైరెక్టర్ ఈ పనిచేశాడంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారన్న వార్త వైరల్ అయ్యింది. ఇది నిజమో కాదో కానీ.. దీనిపై నిమ్స్ డైరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇటు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించలేదు. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆడిపోసుకుంటున్నారు.

ఈ వార్తపై తాజాగా ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేష్ విమర్శలు గుప్పించాడు. తెలంగాణ నలుమూలల నుంచి పేద , మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని.. ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్ లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని.. అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరిచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్ లో మౌళిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు.

హైదరాబాద్ లోనే ప్రముఖ ఆస్పత్రిగా నిమ్స్ పేరుగాంచింది. అనేక మంది స్పెషలిస్ట్ వైద్యులు, సీనియర్ వైద్యులున్నారు. అద్భుతమైన వైద్యానికి పేరుగాంచింది. ఆ ఆస్పత్రి నిమ్స్ డైరెక్టర్ కే మనోహర్ కు గుండెపోటు వచ్చిందని.. ఆయన నిమ్స్ ను కాదని అపోలో ఆస్పత్రిలో చేరారని ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో వైద్యం అందించే వైద్యనిపుణులు ఉన్నారని.. ఆయన నిమ్స్ కాదని.. కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై మనోహర్ కానీ.. నిమ్స్ వర్గాలు కానీ స్పందించలేదు. ఈ వార్త నిజమా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.