Begin typing your search above and press return to search.
నిమ్స్ డాక్టర్లు ఆమెను 'చంపేశారు'
By: Tupaki Desk | 6 April 2018 5:50 AM GMTకనిపించని దేవుడి కంటే కనిపించే వైద్యుడే అసలుసిసలు దేవుడిగా భావిస్తుంటారు. ప్రాణాలు పోసే డాక్టర్ ను పూజిస్తారు.. అభిమానించి.. ఆరాధిస్తుంటారు. మరి.. అలాంటి కీలకమైన వైద్యవృత్తిలో ఉండి నిర్లక్ష్యం దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వైద్యుల మీదనే ఉంటుంది.
నిర్లక్ష్యానికి పరాకాష్ఠలా హైదరాబాద్ కు చెందిన నిమ్స్ వైద్యుల నిర్వాకం వింటే అవాక్కు అవ్వాల్సిందే. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలి డిశ్చార్జి సమ్మరీలో మరణించినట్లుగా రికార్డు ఇచ్చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం చూసినప్పుడు వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అన్న భావన కలగక మానదు. ఈ ఎపిసోడ్ లో మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. తనను చనిపోయినట్లుగా తేల్చేసిన వైనం సదరు వృద్ధురాలికి చాలా ఆలస్యంగా అర్థమైంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన యార్లగడ్డ కోటేశ్వరరావు.. సరోజినీదేవి దంపతులు ఇద్దరూ స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం అప్పట్లోనే వారు పోరాడారు. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయారు. అనారోగ్యంతో ఉన్న సరోజినీదేవి తరచూ ఆసుపత్రికి వస్తుంటారు. అదే రీతిలో ఫిబ్రవరి 9న నిమ్స్ కు వచ్చారు.
ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు కార్డియాలజీ ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స చేశారు. కోలుకున్న తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. ఫిబ్రవరి 21న ఆమెను ఇంటికి పంపుతూ డిశార్జి సమరీని ఇచ్చారు. వాటిని తీసుకొని ఆమె ఇంటికి వెళ్లిపోయారు.
నెలవారీ చెకప్ లో భాగంగా ఆమె గురువారం తార్నాకలోని సీజీహెచ్ ఎస్ డిస్పెన్సరీకి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆమెను పరీక్షిస్తూ.. పాత రిపోర్ట్స్ ను చూశారు. అందులో ఆమె మరణించినట్లుగా రాసిన డిశ్చార్జి సమరీని చూసి అవాక్కు అయ్యారు. అదే విషయాన్ని ఆమె చెప్పటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం ఎంతన్నది తాజా ఉదంతంతో స్పష్టమైంది. ఆ రికార్డులో సరోజినీదేవి ఫిబ్రవరి 9న ఆసుపత్రిలో అడ్మిట్ అయనట్లుగా.. అదే నెలలో 21న మరణించినట్లుగా ఉంది. దీనిపై విచారిస్తామని అధికారులు చెబుతున్నా.. మరీ ఇంత నిర్లక్ష్యమా అన్న మాట ఈ ఉదంతం తెలిసిన వారంతా అంటున్నారు.