Begin typing your search above and press return to search.
ఇంగ్లాండ్‌లో ఆత్మాహుతి దాడి..19 మంది మృతి
By: Tupaki Desk | 23 May 2017 6:33 AM GMTఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ పారిశ్రామిక నగరమైన మాంచెస్టర్ లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్న ఈ ఉదంతంలో 19 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.35 గంటలకు ఈ పైశాచిక దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. సంగీత కచేరీ మాంచి జోరుగా సాగుతున్న వేళలో ఒక్కసారిగా పేలిన పేలుడుకు అక్కడి వారు తీవ్ర షాక్ కు గురయ్యారని చెబుతున్నారు. పేలుడు జరిగిన వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు.. అక్కడున్న వారిని బయటకు పంపేశారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్రవాద చర్యగా భావిస్తున్న ఈ ఉదంతం అసలు ఎలా జరిగింది? దీనికి బాధ్యులు ఎవరన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. పాప్ సింగర్ అరియానా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె ప్రతినిధి వెల్లడించారు. ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్న ఈ ఘటన గురించి మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.