Begin typing your search above and press return to search.
కేరళను హడలెత్తిస్తున్న నిఫా.. ఆ పండ్లు వల్ల వైరస్.. తినొద్దని సూచనలు
By: Tupaki Desk | 7 Sep 2021 10:37 AM GMTఇప్పటికే దేశం కరోనా కల్లోలంతో అట్టుడుకుతంటే తాజాగా మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనాను పుట్టించిన అదే గబ్బిలాలతో మరో వైరస్ కేరళ రాష్ట్రంలో వ్యాపిస్తోంది. అదిప్పుడు మరణాలకు కారణం అవుతుండడం కలకలం రేపుతోంది.
కరోనా మొదటి కేసు నమోదై ప్రాణాలు కోల్పోవడం కేరళలో కలకలం రేపుతోంది. నిఫా సోకి 12 ఏళ్ల బాలుడు మరణించడం భయాందోళన కలిగిస్తోంది. గబ్బిలాలు, జంతువుల నుంచి సంక్రమించే ఈ నిఫా వైరస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.
కేరళలో 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో చనిపోవడంతో పక్కనే ఉన్న తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ పక్కనే ఉన్న తమిళ జిల్లా అధికారులు జాగ్రత్తలు చేపడుతున్నారు.
కేరళలో నిఫా వైరస్ విస్తరిస్తుండడంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పలు కీలక సూచనలు చేశారు. గబ్బిలాల లాలాజలం నుంచి వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందని.. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిఫా వైరస్ కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని సూచిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను కడిగి తినాలని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 5న నిఫా వైరస్ తో కేరళలో 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఆ బాలుడు గబ్బిలాలు తిన్న ‘రాంభూటాన్’ పండ్లు తినడం వల్లే చనిపోయాడని అనుమానాలు కలుగుతున్నాయి. చనిపోయిన బాలుడి ఇంటి నుంచి సేకరించిన రాంభూటాన్ పండ్లను కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు నమూనాలను సేకరించారు. పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్ డైరెక్టర్ పండ్లు తినే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గబ్బిలాలు నిఫా వాహకాలు కారణంగా ఉండడంతో గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిఫా వైరస్ సోకుతుందని వెల్లడించారు.