Begin typing your search above and press return to search.
నీరవ్ మోడీ దగ్గర పెయింటింగ్ వేలం..అవాక్కయ్యేంత ధర!
By: Tupaki Desk | 27 March 2019 11:10 AM GMTబ్యాంకులకు టోపీ పెట్టేసిదేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి భారీ షాక్ తగిలింది. అతగాడి దగ్గర ఉన్న అరుదైన పెయింటింగ్ కలెక్షన్ ను తాజాగా వేలం వేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టేసి బ్రిటన్ చెక్కేసిన అతగాడి ఆచూకీని బ్రిటన్ మీడియా సంస్థ బయటపెట్టటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అతన్ని లండన్ లో స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ప్రయత్నించినా ఆయనకు బెయిల్ రాలేదు.
ఇదిలా ఉంటే.. మోడీ దగ్గరున్న ఖరీదైన పెయింటింగ్ లను తాజాగా వేలం వేశారు. ఆదాయపన్ను శాఖ నిర్వహించిన ఈ వేలంలో రాజా రవివర్మ పెయింటింగ్ భారీ ధర పలికింది. ఆయన వేసిన పెయింటింగ్ కు ఏకంగా రూ.14 కోట్లకు అమ్ముడు కావటం గమనార్హం.
ఆదాయపన్ను శాఖ.. ఈడీలు కలిసి చేపట్టిన వేలానికి ముంబయి స్పెషల్ కోర్టు అనుమతిని ఇచ్చేసింది. ఈ వేలంలో భాగంగా 173 విలువైన పెయింటింగ్స్ తో పాటు.. 11 వాహనాల్ని కూడా వేలం వేశారు.ఈ శాఖలకు రూ.95.91 కోట్ల పన్ను మొత్తం బకాయి ఉంది. ఈ బకాయిల మొత్తాన్ని రికవరీ చేయటానికి వీలుగా 68 పెయింటింగ్ లను వేలం వేశారు. తాజా వేలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో నీరవ్ మోడీకి చెందిన మరిన్ని ఆస్తుల్ని వేలం వేయటం ఖాయమంటున్నారు.