Begin typing your search above and press return to search.

ప్రేమజంటను విడదీసిన పాపం నీరవ్ మోడీదే..

By:  Tupaki Desk   |   9 Oct 2018 7:43 AM GMT
ప్రేమజంటను విడదీసిన పాపం నీరవ్ మోడీదే..
X
నీరవ్ మోడీ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ అందరినీ షాక్ కు గురిచేస్తోంది.. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14వేల కోట్లను కుచ్చుటోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. దొరికినోళ్లందరినీ మోసం చేశాడని మరో ఘటన నిరూపించింది.

కెనెడాకు చెందిన అల్ఫోన్సో అనే వ్యక్తి 2012లో ఓ ఈవెంట్ లో నీరవ్ మోడీని కలిశాడట.. ఆ తర్వాత ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. అల్ఫోన్సో పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు. 2018 ఏప్రిల్ లో లక్ష డాలర్ల బడ్జెట్ తో ‘స్పెషల్ ఎంగేజ్ మెంట్ రింగ్’ పంపించాలని నీరవ్ మోడీకి మెయిల్ చేశాడు. అయితే అప్పటికే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి విదేశాలకు చెక్కేశాడు. కానీ అల్ఫోన్సోకు ఈ విషయం తెలియలేదు. అదే అదునుగా భావించిన నీరవ్ మోడీ నకిలీ డైమండ్ రింగ్ ను అల్ఫోన్సోకు పంపించాడు. దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. ఈ రింగ్ అల్ఫోన్సో ప్రియురాలికి నచ్చడంతో మరో రింగ్ కావాలని ఆమె కోరింది. దీంతో ఆల్ఫోన్సో మరో రింగ్ కోసం మొత్తం 1.48 కోట్లను నీరవ్ మోడీకి చెల్లించి ఉంగరాలను పొందాడు.

అయితే రింగ్ లను చూసి అనుమానం వచ్చిన అల్పోన్సో ప్రియురాలు వాటిని పరీక్ష చేయించింది. దీంతో అవి నకిలీవేనని తేలింది. విషయం తెలిసిన అల్ఫోన్సో కూడా షాక్ అయ్యారు. తనకు నకిలీ రింగ్ లు ఇస్తావా అని అల్ఫోన్స్ ప్రియరాలు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. దీంతో వీరి ప్రేమ పెటాకులైంది. నీరవ్ మోసం వల్లే తన జీవితం నాశనమైందని భావించి అల్ఫోన్సో రూ.31 కోట్లకు కాలిఫోర్నియా కోర్టులో నీరవ్ పై దావా వేశాడు. ఇప్పటికే 14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ.. ఇప్పుడు ఈ ప్రేమ జంటను విడదీసి మరోపాపం మూటగట్టుకున్నారు.