Begin typing your search above and press return to search.
దొంగ మోడీ లండన్ లో దర్జాగా తిరుగుతున్నాడు
By: Tupaki Desk | 9 March 2019 6:35 AM GMT వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర రూ.13000 కోట్లు అప్పు తీసుకుని దాన్ని ఎగ్గొట్టి పారిపోయాడు. అతని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా చిన్న ఆచూకి కూడా దొరకలేదు. ఇన్నాళ్లుకు లండన్‌లోని టెలిగ్రాఫ్ మ్యాగజైన్ రిపోర్టర్‌కు దొరికాడు నీరవ్ మోడీ. చాలా కూల్‌గా మీసాలు పెంచి.. చాలా కాస్ట్లీ లెదర్ జాకెట్‌తో లండన్ వీధుల్లో నడుస్తున్నాడు. అతడ్ని గుర్తించిన టెలిగ్రాప్ రిపోర్ట్ వరుస ప్రశ్నలతో నీరవ్ మోడీని ఉక్కిరిబిక్కిరి చేశారు. అన్ని ప్రశ్నలకు నీరవ్ మోడీ ఇచ్చిన సమాధానం ఇక్కటే. నో కామెంట్ అని.
నీరవ్ మోడీ లండన్‌లో ఉన్నాడు సరే. అక్కడే ఏం చేస్తున్నాడు అని అంటే.. మోడీకి వచ్చింది ఒక్కటే పని వజ్రాలు అమ్ముకోవడం. ఇప్పుడు లండన్‌లో కూడా నీరవ్ మోడీ అదే చేస్తున్నాడు. అయితే తనని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మొత్తం గెటప్ మార్చేశాడు. టిప్ టాప్‌గా తయారై పనిమీద బయటకు వచ్చాడు. ఇంతలో టెలిగ్రాఫ్ రిపోర్టర్ గుర్తుపట్టేశాడు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగాడు. రిపోర్టర్ ఎన్ని అడిగినా అన్నింటికి నో కామెంట్ అనే సమాధానం ఇచ్చాడు. మధ్యలో ఇంటర్వూని తప్పించుకోవడానికి ఏదైనా ట్యాక్సీ ఎక్కి వెళ్లిపోదామని ప్రయత్నించినా ఒక్క ట్యాక్సీ కూడా దొరకలేదు. దీంతో.. దాదాపు రెండు నిమిషాల పాటు నీరవ్ మోడీని టెలిగ్రాఫ్ రిపోర్టర్ వెంటాడాడు. ఫైనల్‌గా ఒక ట్యాకీ దొరకడంతో ఎక్కి వెళ్లిపోయాడు.
ఇన్నాళ్లు నీరవ్ మోడీ కన్పించలేదని కేంద్రలు గగ్గోలు పెట్టింది. మరి ఇప్పుడు దొంగలంతా లండన్‌లో ఉన్నారన్న విషయం అందరికి తెలిసిపోయింది. కనీసం ఇప్పుడైనా మోదీపై మోదీ ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలి.