Begin typing your search above and press return to search.
రేపైనా నిర్భయకు న్యాయం జరిగేనా?
By: Tupaki Desk | 19 March 2020 3:59 AM GMT2012లో దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ కేసులో దోషులకు ఉరి శిక్ష పడి నెలలు గడుస్తున్నా కూడా భారత న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఉపయోగించుకుని దోషులు తప్పించుకుంటూ ఉన్నారు. గత నెలలోనే నిర్భయ దోషులకు శిక్ష అమలవ్వాల్సి ఉన్నా కూడా చివరి నిమిషంలో వాయిదా వేశారు. మరోసారి నిర్బయ దోషుల ఉరి శిక్ష ఖరారు అయ్యింది. అంతా సజావుగా సాగితే రేపు నిర్భయ దోషులకు తెల్లవారుజామున ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది.
కాని మళ్లీ ఉరి శిక్షను వాయిదా వేయించుకునేందుకు దిల్లీ కోర్టులో నిర్భయ దోషులు పిటీషన్ వేశారు. మరో వైపు నిర్భయ దోషుల్లో ఒక్కడైన అక్షయ్ భార్య తనకు భర్త నుండి విడాకులు ఇప్పించండి అంటూ పిటీషన్ వేయడం జరిగింది. ఆమె పిటీషన్ తో ఉరి శిక్ష వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ న్యాయ నిపుణులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు దిల్లీ కోర్టులో నిర్భయ దోషులు వేసిన పిటీషన్ ను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒక వైపు నిర్భయ దోషులు ఉరిని వాయిదా వేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరో వైపు తీహార్ జైలు అధికారులు జైలు ప్రాంగణంలో నిన్న ఉరికి సంబంధించి డమ్మీ ట్రయల్స్ ను నిర్వహించారు. అర్ధగంట పాటు సాగిన ఈ డమ్మీ ట్రయల్స్‌ను నిర్వహించిన అధికారులు అన్ని విధాలుగా ఉరికి రెడీ అయినట్లుగా చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా ముందస్తు డమ్మీ ట్రయల్స్ ను నిర్వహించినట్లుగా జైలు అధికాయి పేర్కొన్నారు.
రేపటితో నిర్భయకు న్యాయం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా జనాలు వీరిని వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. కాని న్యాయపరమైన చిక్కులు సమస్యల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. మరి ఇప్పుడైనా వీరి ఉరి శిక్ష అమలయ్యేనా? లేదంటే మళ్లీ కోర్టు ఉరి శిక్ష అమలు పై స్టే ఇచ్చేనా అంటూ అంతా కూడా ఉత్కంఠత తో ఎదురు చూస్తున్నారు.