Begin typing your search above and press return to search.

నిర్భయ నిందితులపై రాష్ట్రపతికి నిర్భయ కుటుంబాల లేఖ

By:  Tupaki Desk   |   16 March 2020 11:00 AM GMT
నిర్భయ నిందితులపై రాష్ట్రపతికి నిర్భయ కుటుంబాల లేఖ
X
నిర్భయ దోషులకు ఉరిశిక్షకు వేళైంది. మార్చి 20న వారిని ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. వీరి మరణానికి అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు నిర్భయ నిందితుల కుటుంబాలు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తమకు కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతికి నిర్భయ నిందితుల సోదరులు, పిల్లలు సంతకాలు చేసి లేఖ రాశారు. నిర్భయ నిందితులను ఉరితీయాల్సిన అవసరం లేదని.. మహాపాతకానికి ఒడిగట్టినవారినే క్షమిస్తుంటారని.. క్షమించడం లో గొప్పదనం ఉందని లేఖలో కోరారు.

ఈ లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిర్భయ నిందితుల ఉరిని ఆపేందుకు చివరి ప్రయత్నంగా వారి కుటుంబ సభ్యులు తాము చనిపోతామని కోరడం కలకలం రేపింది. రాష్ట్రపతి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు నలుగురు నిర్భయ నిందితులును మార్చి 20న 5.30 గంటలకు ఉరితీయడానికి తీహార్ జైల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇక చివరి ప్రయత్నంగా తమ క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడం తో దీనిపై నిర్భయ దోషి అక్షయ్ సింగ్ రెండు రోజుల కిందట సుప్రీం కోర్టుకెక్కాడు. ఇక వినయ్ సింగ్ అనే మరో నిర్భయ నిందితుడు తన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీంకెక్కాడు. ఈ పిటీషన్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఇప్పటికే కోర్టు ఉరితీయాలని తీర్పునివ్వడం తో ఇవి వృథా పిటీషన్లుగా మారాయి.