Begin typing your search above and press return to search.
నిర్భయ దారుణం రిపీట్: ప్రైవేట్ పార్టులోకి రాడ్డు చొప్పించిన ఘోరం
By: Tupaki Desk | 20 Oct 2022 4:14 AM GMTయావత్ దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం.. మళ్లీ మరోసారి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. బాధితురాలితో ఆస్తి వివాదం ఉన్న వ్యక్తి.. మరో నలుగురితో కలిసి ప్లాన్ ప్రకారం ఆమెను కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు నరకాన్ని చూపించటమే కాదు.. అత్యంత హీనంగా.. ఘోరంగా వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. ప్రైవేటు పార్టులో రాడ్డును జొప్పించిన వారు.. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి గోనె సంచిలో చుట్టేసి రోడ్డు మీద పడేసి వెళ్లిన అత్యంత హీనమైన ఉదంతానికి దేశ రాజధాని వేదికగా మారింది. ఈ ఉదంతం విన్న వారంతా నిర్భయ ఉదంతాన్ని ఇట్టే గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
నంద్ నగరానికి చెందిన 36 ఏళ్ల బాధితురాలు ఈ నెల పదహారున యూపీలోని గాజియాబాద్ లో సోదరుడి పుట్టినరోజు వేడుకులకు హాజరయ్యారు. ఊరికి తిరిగి వచ్చేందుకు బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆమెకు పిస్టల్ గురి చూపించి బలవంతంగా కారులోకి ఎక్కించారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తమ ఆరాచకాన్ని రెండు రోజులు పాటు సాగించారు. ఆ తర్వాత ఆమెను గోనె సంచిలో చుట్టేసి గజియాబాద్ సమీపంలోని రోడ్డు మీద పడేసి తమ దారిన తాము వెళ్లిపోయారు. ఆమె ఉదంతం గురించి ఈ నెల 18న ఫోన్ రాగా.. పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దారుణ ఉదంతానికి కారణమైన ఐదుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని గురు తేగ్ ఆసుపత్రి ప్రకటించింది. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు కనిపిస్తోందని.. ఆమె ప్రైవేటు పార్టులోకి వేరే వస్తువు ఆనవాళ్లు కనిపించాయని ఆసుపత్రికి చెందిన కొందరు చెబుతున్నారు. బాధితురాలికి నిందితుడికి మధ్య ఆస్తి వివాదం ఉందని.. ప్రస్తుతం అది కోర్టులోనడుస్తుందన్నారు.
అత్యాచారం చేసిన తర్వాత రాడ్డును జొప్పించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది.
గాజియాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి పేర్కొంటే.. ఢిల్లీ మహిళా కమిషన్ మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్లుగా వెల్లడించటం గమనార్హం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో అమానుషానికి పాల్పడిన వారి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.