Begin typing your search above and press return to search.
నిర్భయ కేసు : మైనర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా ?
By: Tupaki Desk | 20 March 2020 2:30 PM GMTదేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఘోరమైన సంఘటన లో నిర్భయ రెండు వారాల పాటు మృత్యువు తో పోరాడి ..చివరికి ఆ మృతువు చేతిలో ఓడిపోయింది. ఈ ఘటన పై ప్రతి ఒక్కరు కూడా నిర్భయపై సరైన న్యాయం జరగాలి అంటూ , ఆమెకి మద్దతుగా నిలిచారు. అనేక మలుపుల తరువాత చివరగా ఎట్టకేలకి నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో జైలు నెంబర్ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు.
2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయపై ఆరుగురు మృగాళ్ల లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మరో వ్యక్తి మైనర్ కావడంతో, జువైనల్ యాక్ట్ కింద మూడేళ్ళ జైలు శిక్ష విధించి విడుదల చేశారు. అయితే నిర్భయ కేసులో మిగిలిన ఐదు మంది నిందుతుల ఫోటోలు బయటకి వచ్చినా కూడా , ఆ మైనర్ ఫోటో ఒక్కటి కూడా బయటకి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అలాగే ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పిఉంచడం వల్ల ఆ మైనర్‌ను ఎవరూ గుర్తుపట్టలేరు.
అయితే ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని గడుపుతున్నట్టు సమాచారం. నిర్భయ ఘటన సమయంలో మైనర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. అలాగే వారందరి కంటే ..వీడే నిర్భయని మరింతగా చిత్రహింసలకు గురిచేశాడు అని తెలియడంతో , మైనర్ అని ఇలాంటి వారిని బయటికి వదలవద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అయితే , మన చట్టం ప్రకారం ...మూడేళ్ళ జైలు శిక్ష తరువాత అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే , అతని ఆనవాళ్లు కొందరు పోలీసులకి తప్ప , ఇంకెవరికి తెలియదు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. అతనిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.