Begin typing your search above and press return to search.

నిర్భ‌య త‌ల్లి క‌న్నీరు మున్నీరు

By:  Tupaki Desk   |   31 Jan 2020 5:08 PM GMT
నిర్భ‌య త‌ల్లి క‌న్నీరు మున్నీరు
X
త‌న కూతురిని ఆరుగురు మృగాలు క‌లిసి దారుణంగా అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించి హింసించి చంపేస్తే ఆ త‌ల్లి ఎంత‌టి వేద‌న అనుభ‌విస్తుందో చెప్పేదేముంది? అంత‌టి ఘాతుకానికి పాల్ప‌డిన నిందితులు ఏళ్ల‌కు ఏళ్లు జైళ్ల‌లో థిలాసాగా గ‌డిపిస్తుంటే.. వాళ్ల‌కు ఉరి శిక్ష ప‌డ్డాక కూడా ఏళ్ల పాటు అమ‌లుకు నోచుకోకుంటే.. చ‌ట్టంలోని లొసుగుల్ని ఉప‌యోగించుకుని శిక్ష వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంటే.. ఆ త‌ల్లి ఇంకెంత బాధ ప‌డుతుంది? దేశం మొత్తానికి శోకం మిగిల్చిన నిర్భ‌య ఉదంతంలో ఇదే జ‌రుగుతోంది. నిర్భ‌యపై దారుణానికి పాల్ప‌డిన నిందితుల‌కు ఉరి శిక్ష ఎంత‌కీ అమ‌లు కాక‌పోవ‌డం ప‌ట్ల ఆమె త‌ల్లి క‌న్నీరు మున్నీర‌య్యారు.

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించడంపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ తీర్పుపై మీడియాతో మాట్లాడుతూ ఆమె క‌న్నీరుమున్నీర‌య్యారు. ఏడేళ్లుగా తమకు అన్యాయం జరుగుతోందని, దోషులు ఏం కోరుకుంటున్నారో న్యాయస్థానాల్లో అదే జరుగుతుందంటూ ఆమె బోరుమ‌న్నారు. -ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని ఆమె ఆరోపించారు. పదేపదే కోర్టులు దోషులను ర‌క్షిస్తున్నాయ‌న్నారు.. ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు రావాలని నిర్భయ తల్లి కోరారు. శనివారం దోషులను ఉరి తీయాల్సి ఉండగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ దోషులను ఉరితీయరాదని పాటియాలా కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో దోషులకు ఉరిశిక్ష ముచ్చటగా మూడోసారి వాయిదా పడిన‌ట్ల‌యింది. మ‌రోవైపు నిర్భ‌య హ‌త్య కేసు దోషుల‌కు ఉరి శిక్ష ప‌డ‌దంటూ వారి త‌ర‌ఫు న్యాయ‌వాది మీడియా ముందు స‌వాలు చేయ‌డం గ‌మ‌నార్హం.