Begin typing your search above and press return to search.
షాకింగ్...నిర్భయ దోషి పైనే అత్యాచారం జరిగిందట!
By: Tupaki Desk | 28 Jan 2020 1:50 PM GMTనిర్భయ ఘటన దేశంలో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్నేహితుడితో కలిసి రాత్రి పూట దేశ రాజధాని ఢిల్లీలో బస్సెక్కిన నిర్భయపై ఆరుగురు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్యసమాజం సిగ్గుపడేలా నిర్భయపై వారంతా కలిసి సాగించిన దురాగతంతో దేశ యువత ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టగా... నిర్భయ చట్టం రూపకల్పన జరిగింది. ఇక ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగిన ఈ కేసు ఎట్టకేలకు ముగియగా... నిర్భయ దోషులకు ఉరే సరైన శిక్ష అని సంచలన తీర్పు చెప్పింది. మరో నాలుగు రోజుల్లో సజీవంగా ఉన్న నలుగురు దోషులకు ఉరికి రంగం సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో నిర్భయపై అనాగరికంగా వ్యవహరించిన ముఖేష్ సింగ్... తనపై జైల్లో అత్యాచారం జరిగిందంటూ కోర్టుకు విన్నవించాడు.
తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ముందు ముఖేష్ సింగ్ సంచలన విషయాలను వెల్లడించాడు. తీహార్ జైల్లో తననై లైంగిక దాడి జరిగిందని అతడు కోర్టుకు విన్నవించాడు. జైల్లో తన మాదిరే శిక్ష అనుభవిస్తున్న సహ దోషిీ అక్షయ్ సింగ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ధర్మాసనానికి విన్నవించాడు. తీహార్ జైలు అధికారుల సహకారంతోనే ఈ ఘటన జరిగిందని కూడా అతడు చెప్పుకొచ్చాడు. రాష్ట్రపతికి పెట్టిన క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని వాపోయాడు.
ఈ మేరకు ముఖేష్ సింగ్ తరఫున న్యాయవాది అంజనా ప్రకాశ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. బుధవారం దీనిపై తుది తీర్పును వెల్లడించనుంది. నిర్భయపై అనాగరికంగా వ్యవహరించిన ముఖేష్ తీరా తన దాకా వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగిందంటూ కోర్టుకు విన్నవించిన తీరు నిజంగానే ఆసక్తి రేపుతోంది. నిర్భయ కేసులో ఉరి శిక్ష ఖరారైన ముఖేష్ వినిపించిన ఈ కొత్త వాదనపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. మొత్తంగా ఉరి కంభం ఎక్కుతున్న తరుణంలో కొత్త తరహా వాదనను కోర్టు ముందుకు తీసుకొచ్చిన ముఖేష్ అసలు ఉద్దేశమేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.