Begin typing your search above and press return to search.

‘నిర్భయ’ పిల్ల పిశాచిలో వణికించే మరో కోణం

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:07 AM GMT
‘నిర్భయ’ పిల్ల పిశాచిలో వణికించే మరో కోణం
X
దాదాపు నాలుగేళ్ల క్రితం (కచ్ఛితంగా చెప్పాలంటే 2012 డిసెంబరు) దేశం మొత్తాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం గురించి తెలిసిందే. ఢిల్లీలోని కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థిని అత్యంత అమానవీయంగా సామూహికంగా అత్యాచారం చేసి.. బస్సులో నుంచి బయటకు తోసేసిన వైనం దేశం మొత్తాన్ని కదిలించేసిది. బతికేందుకు ఎంతో పోరాటం చేసినా.. ఆమె ప్రాణాలు మాత్రం దక్కని దుస్థితి. ఆమె చేసిన పోరాటానికి మారుగా దేశ ప్రజలంతా ఆమెను ‘నిర్భయ’ అని పిలుచుకోవటమే కాదు.. ఆమెకు ఎదురైన దారుణం మరెవరికి ఎదురు కాకూడదని.. అలా ఎవరైనా వ్యవహరిస్తే వారిని కఠినంగా శిక్షించేందుకు ఆమె పేరు మీదనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.

నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఘటనల్లో నిందితుల్లో ఒకరు బాల నేరస్తుడు (నేరం జరిగే సమయానికి) కావటం ఒకటైతే.. అందరిలోకి అత్యంత దారుణంగా వ్యవహరించింది అతడే కావటం గమనార్హం. చట్టాల్లోని లొసుగుల కారణంగా.. జువైనల్ కు మరణశిక్ష విధించకూడదన్న కారణంగా అతడికి జైలుశిక్ష విధించి.. ఆ తర్వాత అతన్ని విడుదల చేశారు.

అతన్ని విడుదల చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా సంఘాలతో పాటు.. మనసున్న ప్రతిఒక్కరూ అతగాడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టకూడదని డిమాండ్ చేశాయి. అయితే.. నిబంధనల్ని పక్కాగా పాటించే ప్రజాస్వామ్య భారతంలో ఆ పిల్ల పిశాచి మేజర్ గా మారి జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జైల్లో ఉన్నప్పుడే తీవ్రవాదం మీద మనసు పడినట్లుగా గుర్తించిన పోలీసులు అతడ్ని విడుదల చేయకూడదన్నా.. కుదరదంటే కుదరన్నట్లుగా విడిచిపెట్టారు.

కట్ చేస్తే.. తాజాగా అతగాడి గురించి షాకింత్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ దుర్మార్గుడికి ఐఎస్ ఐఎస్ సానుభూతిపరుడన్న విషయాన్ని గుర్తించారు.2015 తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత ఉత్తరప్రదేశ్ నిఘా వర్గాలు ఇతడి కదలికలు సందేహాస్పదంగా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఇతడిపై మరింత నిఘా పెట్టిన భద్రతా వర్గాలు.. తాజాగా అతడికి ఐఎస్ ఐఎస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. చట్టాల్లోని నిబంధనల్ని ఇలాంటి పిశాచాల విషయంలో మినహాయించి.. కఠినంగా శిక్షించాలే కానీ.. వదిలిపెట్టకూడదన్న విషయాన్ని ‘చట్టం’ ఎప్పటికి గుర్తిస్తుందో..?