Begin typing your search above and press return to search.
‘‘నిర్భయ’’ హంతకులకు ఉరి వేయరెందుకు?
By: Tupaki Desk | 16 Dec 2015 4:37 AM GMTమూడేళ్ల క్రితం.. కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయ (దేశం పెట్టిన పేరు)ను అత్యంత దారుణంగా.. అమానవీయంగా సామూహిక అత్యాచారం చేశారు. మాటల్లో వర్ణించలేనంత దారుణంగా శారీరకంగా హింసించి.. రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన విన్న వారంతా షాక్ తిన్నారు. ఇంత అనాగరికంగా వ్యవహరిస్తారా? అని దేశం మొత్తం విస్తుపోయింది. నరరూపరాక్షసుల్లాంటి వారి మీద దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుబికింది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన న్యాయస్థానం నలుగురికి ఉరి.. ఒకరికి పరిమితకాల జైలుశిక్ష (నేరం చేసినప్పుడు మైనర్ కావటతో) వేశారు. ఈ కేసుతోనే.. మహిళల్ని వేధించే వారిపై ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకొచ్చారు.
మరింత దారుణమైన నేరానికి పాల్పడి.. ఉరిశిక్ష విధించిన దోషులకు.. చట్టం తన పని తాను ఎందుకు చేసుకుంటూ పోదు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. హేయమైన దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించిన తర్వాత కూడా వాటిని అమలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు ఎందుకు ఉన్నట్లు? దారుణ నేరాలకు పాల్పడి.. నిరూపితం అయ్యాక కూడా అమలు చేయటానికి ఉన్నఅడ్డంకులేమిటి? నేరం చేసినట్లు నిరూపితమై.. శిక్ష అమలులో ఆలస్యమైతే దాని వల్ల జరిగే నష్టం చాలానే ఉంటుంది. ఈ విషయంలో వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే..ఈ దర్మార్గంలో కీలకపాత్ర పోషించిన మైనర్ వ్యవహారం మరింత ఆందోళనకరం. దారుణమైన నేరానికి పాల్పడినప్పటికీ.. అతని వయసు నేరం జరిగే నాటికి మైనర్ కిందనే ఉండటంతో అతడిని బాల నేరస్తుడిగా గుర్తిస్తూ పరిమితకాలం జువైనల్ హోంలో ఉంచారు. అతను విడుదలయ్యే సమయం దగ్గర పడుతోంది. అయితే.. అతన్ని మరికొంత కాలం అధికారు అబ్జర్వేషన్ లో ఉంచాలన్న అంశంపై చర్చ సాగుతోంది.
దేశం మొత్తాన్ని కదిలించిన కేసు దోషులకు సైతం శిక్ష అమలు ఇంత ఆలస్యమా? దారుణ హింసకు గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావును జయించేందుకు పోరాటం చేస్తున్న నిర్భయను కాంగ్రెస్ అధినేత్రి సోనియా మొదలు పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆమెకు న్యాయం చేస్తామని మాటలు చెప్పారు. మృత్యువుతో చేసిన పోరాటంతో ఓడిపోయిన నిర్భయ ఆత్మకు శాంతి కలిగేలా.. ఆమె చివరి కోరిక తీర్చేలా దోషులకు పడిన ఉరిని అమలు చేయటనికి ఎందుకింత ఆలస్యం? దోషుల మీదున్న ప్రేమ.. చావుబతుకుల సమయంలో పరామర్శలకు వెళ్లి.. న్యాయం చేస్తామని.. బాధ్యులపై చట్టప్రకారం దండిస్తామంటూ ఇచ్చిన హామీల మాటేమిటి? నిర్భయ పేరు మీద చట్టం చేశారు. కానీ.. ఆ చట్టానికి కారణమైన బాధితురాలి ఆఖరి కోర్కెను ఎందుకు తీర్చటం లేదు..? ఆమెకిచ్చిన మాట అమలు చేయటానికి ఎన్నేళ్లు..?