Begin typing your search above and press return to search.

కంగన కు నిర్భయ తల్లి థ్యాంక్స్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:19 AM GMT
కంగన కు నిర్భయ తల్లి థ్యాంక్స్.. ఎందుకంటే?
X
బాలీవుడ్ అగ్ర నటి కంగనా రౌనత్ ఇటీవల శివాలెత్తింది. నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం అత్యాచార కేసుల్లో నిందితులను బహిరంగంగా ఉరితీయాలని కంగనా చేసి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అత్యాచార దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా ఫైర్ అయ్యింది.

కాగా బాలీవుడ్ నటి కంగనా రౌనత్ వ్యాఖ్యలను తాజాగా నిర్భయ తల్లి ఆశాదేవి సమర్థించింది. కంగన మాట్లాడిందాంట్లో తప్పేమీ లేదని ఆశాదేవి మద్దతు పలికింది. ఇందిరా జౌసింగ్ వ్యాఖ్యలను ఖండించి నాకు అండగా కంగనా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కంగన చెప్పినట్లు గా అత్యాచార దోషులను బహిరంగంగా ఉరితీయాలనే మాటలను తాను సమర్థిస్తున్నానని నిర్భయ తల్లి స్పష్టం చేశారు.

ఇక నిర్భయ పై జరిగిన దారుణం ఏంటో తనకు మాత్రమే తెలుసునని నిర్భయ తల్లి వాపోయారు. మానవహక్కుల కోసం పోరాడేవారు నిర్భయకు జరిగిన దారుణమప్పుడు ఎటు పోయారని ఆశాదేవి ప్రశ్నించారు.మానవ హక్కుల పేరిట వారు సమాజాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మానవహక్కుల పేరిట వ్యాపారం చేస్తూ నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లే రాక్షసులని.. ఇలాంటి వాళ్లకు రాక్షసులే జన్మిస్తారని మండిపడ్డారు.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడిన వేళ కొందరు వారికి మద్దతుగా మాట్లాడడంపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంగనాకు మద్దతుగా నిర్భయ తల్లి మాట్లాడారు.