Begin typing your search above and press return to search.
నిర్భయ హంతకులు.. ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా!
By: Tupaki Desk | 30 Jan 2020 7:47 AM GMTఅత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని చంపారు. అత్యాచారం చేయడం, హత్య చేయడం చాలా మంది కిరాతకులు చేసిన పనులు. అయితే ఈ కిరాతకులు మరింత రాక్షసంగా వ్యవహరించారు. వర్ణించడానికి ఒళ్లు జలదరించేంత తీవ్రంగా ఆమెను గాయ పరిచారు నిర్భయ హంతకులు. ఆమె మృత్యవు తో పోరాడి, చివరకు తనువు చాలించింది. అంతలా ఆమెతో రాక్షసుల్లా ప్రవర్తించారు. శాడిస్టులు కూడా కలవర పడేంత శాడిజాన్ని ప్రదర్శించారు నిర్భయ హంతకులు.
మరి అలాంటి వారు ఇన్నేళ్లు తాపీగా జైల్లో ఉన్నారు. ఒక్కోడు కండలు పెంచి.. సినిమా హీరోల్లా తయారు అయ్యారు. కిరాతకంగా అత్యాచారం, హత్య చేసి వారు అలా తాపీగా జైల్లో ఉండేలా ఉంది మన వ్యవస్థ. ఇటీవల తెలంగాణ లో మరో అభ్యాగురాలు ఇలాంటి ఘాతుకానికే బలయ్యింది. ఈ నేపథ్యంలో నిర్భయ హంతకుల ఉరెప్పుడు అనే ప్రశ్న తలెత్తింది. దీంతో తీహార్ జైల్లో అప్పటి నుంచి అందుకు ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి!
ఇలా చాలా సంవత్సరాల తర్వాత వారికి శిక్ష అమలు అవుతుందనే వార్తలు వస్తున్నా, అది నెలల తరబడి వాయిదా పడుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో తమకు శిక్ష అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ హంతకులు వ్యూహాత్మకం గా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు. అనేక రీజన్లు చెబుతూ తమకు ఉరి శిక్ష విధించకూడదని వారు కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు.
రాష్ట్రపతి మనసు పెట్టి ఆలోచించలేదని, అందుకే తమ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించ లేదని కూడా వీరు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఇలా శిక్షను తప్పించుకోవడానికి వారు మార్గాలను వెదుక్కొంటూ ఉన్నారు. అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కోసారి పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది.
ఇప్పటికే ముకేష్ సింగ్ అనే వాడు రాష్ట్రపతి కి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ పై మళ్లీ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు వినయ్ శర్మ అనే వాడి వంతు. ముకేష్ పిటిషన్ తో సంబంధం లేకుండా ఇప్పుడు తన పిటిషన్ పెట్టాడు. ఇలా వీరు ఒక్కొక్కరు ఒక్కోసారి పిటిషన్లు పెట్టడం వ్యూహాత్మకమని విశ్లేషకులు అంటున్నారు. అందరికీ ఒకేసారి శిక్ష అమలు అయ్యే అవకాశాలున్నాయి. అయినా ఒక్కోరు ఒక్కో సారి పిటిషన్ పెట్టడం ద్వారా శిక్ష అమలు డిలే అయ్యే వ్యూహాన్ని వారు అమలు చేస్తున్నట్టుగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.