Begin typing your search above and press return to search.
కోవిడ్ సురక్షా మిషన్ కోసం రూ. 900 కోట్లు : నిర్మలా సీతారామన్ !
By: Tupaki Desk | 12 Nov 2020 2:30 PM GMTకరోనా లాక్ డౌన్ తర్వాత కేంద్ర ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ తో భారత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సాధిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. రైతులు, వీధి వ్యాపారులు, మత్స్య కారులకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేశామని వెల్లడించారు. వన్ నేషన్ ... వన్ రేషన్ కార్డు ద్వారా 68.8 కోట్ల మందికి లబ్ధి చేకూరుదోందని తెలిపారు. వలస కార్మికుల వివరాలకు సంబంధించిన పోర్టల్ అభివృద్ధి దశలో ఉందని చెప్పారు నిర్మల సీతారామన్. కరోనా కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్ నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్ టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. దేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. దీని విలువ 2.65 లక్షల కోట్ల రూపాయలు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఈ మొత్తం వాటా 15 శాతంగా నమోదైంది. అందులో ముఖ్యంశాలు చూస్తే ... వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మంచి ఫలితాలనిస్తోంది. 28 రాష్ట్రాల్లు, యూటీల్లో పేదలు వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా 68.8 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. పీఎం స్వనిధి పథకానికి 26.62 లక్షల మంది వీధి వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. 13.78 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. అందుకోసం రూ.1373.33 కోట్ల నిధులను విడుదల చేశాం.
వలస కార్మికుల వివరాలను తెలిపే పోర్టల్ అభివృద్ధి దశలో ఉంది. అది అందుబాటులోకి వస్తే వలస కార్మికులు ఎక్కడికి పోతున్నారు? ఏం పనిచేస్తున్నారన్న పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరింది.1.83 కోట్ల దరఖాస్తులు రాగా. 1.57 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను బ్యాంకులు మంజూరు చేశాయి. వాటి ద్వారా రెండు దశల్లో 1,34,262 కోట్లు మంజరయ్యాయి. రైతులకు నాబార్డు ద్వారా అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద 25 వేల కోట్లను మంజూరు చేశాం. మత్ససంపద యోజన పథకం కింద 21 రాష్ట్రాల్లోని మత్స్యకారుకు రూ.1681 కోట్ల నిధులు మంజూరు చేశాం.ఇక పాక్షిక క్రెడిట్ గ్యారటీ స్కీమ్ 2.0 కింద రూ.26,889 కోట్లు, NBFC/HFCలకు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద రూ.7227 కోట్లు, డిస్కామ్స్ కి 1,18,273 నిధులను మంజూరు చేశారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు, యూటీలకు రూ.31,136 కోట్లు చేరాయి.
స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కరోనా కారణంగా మార్చి, సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్ల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. ఈఎల్ సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం అని తెలిపారు. 61 లక్షల రుణ గ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి. 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం అని తెలిపారు. పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్ యూ బ్యాంకుల పోర్ట్ ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించామని, ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్ బీఎఫ్ సీ, హెచ్ ఎఫ్ సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి. 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్ గా చెల్లించాం అని తెలిపారు.
అలాగే, కరోనా ను అంతం చేయడానికి అవసరమైన వ్యాక్సిన్ ను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించింది. దేశీయంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా సురక్షా మిషన్ కింద ఈ మొత్తాన్ని కేటాయించింది. కరోనా సురక్షా మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి 900 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించడానికి నిర్మలా సీతారామన్.. తన శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి దేశ రాజధానిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పలు ప్యాకేజీలు ప్రకటించారు.