Begin typing your search above and press return to search.

క‌న్న‌డిగుల మ‌న‌సు దోచుకోవ‌టానికే బ‌స‌వేశ్వ‌రుని మాట‌లు?

By:  Tupaki Desk   |   5 July 2019 9:57 AM GMT
క‌న్న‌డిగుల మ‌న‌సు దోచుకోవ‌టానికే బ‌స‌వేశ్వ‌రుని మాట‌లు?
X
మోడీ వ్యూహాలు ఒక ప‌ట్టాన అర్థం కావు. చాలా సునిశితంగా ప‌రిశీలిస్తే త‌ప్పించి కొరుకుడుప‌డ‌వు. తాము టార్గెట్ చేసిన దానిని సొంతం చేసుకోవ‌టానికి మోడీషాలు ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు. ప‌డుకున్నా.. లేచినా నిత్యం తాము టార్గెట్ చేసిన అంశాల్ని ఏ మాత్రం వ‌దిలిపెట్ట‌కుండా ఉండే మోడీషాల మ‌న‌సును ఎరిగి.. వారి తీరుకు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించారు కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.

బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా ఆమె సంఘ‌సంస్క‌ర్త బ‌స‌వేశ్వ‌రుని వ‌చ‌నాల్నిప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. రానున్న కొద్ది రోజుల్లో క‌న్న‌డ పీఠాన్నికొల్ల‌గొట్టాల‌న్న ప్లాన్ లో ఉన్న త‌మ బిగ్ బాస్ మ‌న‌సు దోచుకోవ‌టంతోపాటు.. క‌న్న‌డిగుల ప‌ట్ల త‌మ‌కున్న గౌర‌వాభిమానాల్ని బస‌వ ప్ర‌స్తావ‌న ద్వారా ఫ్రూవ్ చేశార‌ని చెప్పక త‌ప్ప‌దు.

బ‌స‌వేశ్వ‌రుని వ‌చ‌నాల‌నుప్ర‌స్తావించ‌టం ద్వారా.. క‌న్న‌డ ప్ర‌ముఖుడిని తాము గుర్తించిన‌ట్లుగా చేయ‌ట‌మే కాదు.. త‌మ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను క‌న్న‌డిగులు గుర్తిస్తార‌న్న ఆశ‌తో అమిత్ షా ఉన్నారు. మ‌ధ్య యుగాల్లోని అనేక దురాచారాల‌ను ఖండించారంటూ కాయ‌క‌వ కైలాస అని ఉద్యోగ బాధ్య‌త‌ల్ని వెల్ల‌డించ‌టం విశేషం. ఆమె చెప్పిన దానికి అర్థం మ‌రేమిటో కాదు.. మ‌నం ఏ ఉద్యోగాన్ని యఇతే చేస్తామో.. దానిపై మ‌న‌సు పెట్టి బాధ్య‌త‌గా నిర్వ‌ర్తించాల‌ని.. ద‌సోహ అంటే మ‌నం సంపాదించుకున్న దాన్లో కొంత భాగాన్ని స‌మాజానికి తిరిగి ఇవ్వాల‌ని.. మ‌నం ఎంపిక చేసుకున్న ఉద్యోగాన్ని నిబ‌ద్ధ‌త‌తో చేయాల‌న్న సూక్తిని చెప్పార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బ‌స‌వేశ్వ‌రుని బాటలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. స్టాండ‌ప్ ఇండియాలో భాగంగా అంద‌రూ గౌర‌వ‌భావంతో జీవించేందుకు వీలుగా అట్ట‌డుగు వ‌ర్గాల యువ‌త‌కు ట్రైనింగ్ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించ‌టం ద్వారా బ‌స‌వేశ్వ‌రునికి అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ద్వారా క‌న్న‌డ రాష్ట్రం మీద త‌మ ఫోక‌స్ ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. కీల‌క‌మైన కోట్స్ ను చెప్ప‌టం ద్వారా బ‌స‌వేశ్వ‌రుని త‌త్త్వంపై తాము ఎంత నిర్దుష్టంగా ఉన్నామ‌న్న విష‌యాన్నికేంద్రం స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.