Begin typing your search above and press return to search.
మోదీ మాస్టర్ స్ట్రోక్..ఇకపై సర్కారీ బ్యాంకులు పన్నెండే
By: Tupaki Desk | 30 Aug 2019 2:35 PM GMTదేశ ఆర్థిక రంగానికి భారీ తనం తీసుకొస్తామంటూ సంచలన ప్రకటనలు చేసిన నరేంద్ర మోదీ సర్కారు... తాను చెప్పినట్టుగానే వడివడిగా అడుగులు వేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు... ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం స్వరూపాన్నే మార్చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. మోదీ సర్కారు ఈ దిశగా తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. నిర్మల చెప్పిన విషయాలు విన్నంతనే దేశ ప్రజలంతా నిజంగానే ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పక తప్పదు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలమ్మ ఏం చెప్పారన్న విషయానికి వస్తే... ఇప్పటిదాకా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మొత్తం 27 బ్యాంకులు ఉండగా.. ఇకపై వాటి సంఖ్యను 12కు కుదిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పలు బ్యాంకులను విలీనం బాట పట్టిస్తామని ప్రకటించిన ఆమె... ఏఏ బ్యాంకులను దేనిలో విలీనం చేస్తామన్న విషయాన్ని కూడా ఆమె అక్కడికక్కడే క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)ను ఏమాత్రం టచ్ చేయకుండానే మోదీ సర్కారు బ్యాంకుల విలీనానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. దీని ప్రకారం... ఆంధ్రా బ్యాంకు - కార్పొరేషన్ బ్యాంకు - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు విలీనం కాబోతున్నాయని - ఈ మూడు బ్యాంకులు ఒకే బ్యాంకుగా ఏర్పడుతున్నాయని ఆమె వెల్లడించారు. ఈ 3 బ్యాంకుల కలయికతో దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకు రూపుదిద్దుకుంటుందని కూడా నిర్మల చెప్పారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) - యునైటెడ్ బ్యాంకులు ఒకటిగా విలీనం అవుతున్నాయని చెప్పిన ఆమె... ఈ మూడు బ్యాంకుల కలయికతో ఏర్పాటయ్యే కొత్త బ్యాంకు... దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారుతుందని వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల కలయికతో కొత్తగా ఏర్పడే బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ రెండు విలీనాలే కాకుండా... సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంకు కలిసిపోతుందని - అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం అవుతుందని ఆమె వివరించారు.
తాజా విలీనాల కారణంగా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఇప్పుడున్న 27 బ్యాంకుల స్థానంలో ఇకపై 12 బ్యాంకులు మాత్రమే ఉంటాయని నిర్మల తెలిపారు. అయినా ఈ దిశగా ఇంత సంచలన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నామన్న విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. విజయ్ మాల్యా - నీరవ్ మోదీ లాంటి ఆర్థిక నేరగాళ్ల ఆటలకు చెక్ పెట్టడంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు బిలియన్ డాలర్ల వ్యవస్థగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. మొత్తంగా మోదీ సర్కారు కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమదైన భారీ తనంతో కొత్తగా కార్యకలాపాలు సాగించనున్నాయన్న మాట. ఈ తరహా మార్పు కారణంగా దేశ ప్రజలకు మేలు జరుగుతుందా? లేదంటే నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులు తప్పవా? అన్న విషయం ఇప్పుడప్పుడే చెప్పలేమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.