Begin typing your search above and press return to search.
సరిహద్దుల్లో చైనా సైనికులతో మాట్లాడిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 9 Oct 2017 5:06 AM GMTఅనుకోని రీతిలో సర్‌ప్రైజ్ చేయటం కేంద్రమంత్రి కమ్ తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు మాత్రమే సాధ్యమేమో? ఆ మధ్యన ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ బేస్ అయిన సియాచిన్ ను సందర్శించి అక్కడి సైనికులతో మాట్లాడిన ఆమె.. ఈసారి అరుణాచల్ ప్రదేశ్.. సిక్కింలలో పర్యటించారు.
అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ తనదేనని మెలికిపెట్టి.. అడ్డగోలువాదనను వినిపించే డ్రాగన్ దేశానికి అర్థంకాని రీతిలో ఆమె పర్యటన సాగిందని చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ లలో పర్యటించిన సందర్భంగా అక్కడి సరిహద్దుల్లో పహారా కాస్తున్న చైనా సైనికులతో ఆమె కాసేపు ముచ్చటించారు.
ఊహించనిరీతిలో భారత రక్షణ మంత్రి ఏకంగా తమతో మాట్లాడటం చైనా సైనికులకు అర్థం కాలేదనే చెప్పాలి. తమ సైనికుల్ని పరిచయం చేసిన చైనా అధికారి బాడీ లాంగ్వేజ్‌ను చూడాల్సిందే. కాసేపు తమ గురించి వివరించినట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తుంది.
చైనా సైనికులతో కేంద్రమంత్రి జరిపిన ముచ్చట్ల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చైనా సైనికులతో మాట్లాడటానికి ముందు ఆమె భారత్ - చైనా సరిహద్దుల్లోని డోక్లాం - నాథూలా ప్రాంతాన్ని ఆమె సైనిక హెలికాఫ్టర్లో పరిశీలించారు. భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాంలో ఆగస్టు 28న రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత నుంచి పరిస్థితి యథాతధంగా ఉందని భారత్ ప్రకటించిన సందర్భంలోనే కేంద్ర రక్షణ మంత్రి అక్కడ పర్యటించటం ప్రాధాన్యత చోటు చేసుకుంది.
ఇక.. చైనా సైనికులతో కేంద్రమంత్రి సంభాషణలు చూస్తే.. నమస్తే అన్న తర్వాత.. నమస్తే అంటే అర్థం మీకు తెలుసా? అని ఆమె అడగ్గా.. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అంటూ చైనా సైనికులు చిరునవ్వులు చిందించాడు. చైనాలో నమస్తేను ఏమంటారు? అన్న ప్రశ్నకు నిహోవ్ అని బదులిచ్చారు.ఆ తర్వాత తనకు పరిచయం చేసిన చైనా సైనికులను నిహోవ్ అంటూ ఆమె పేరు పేరునా పలుకరించారు. తమ మాటల మధ్యలో ఒక సైనికుడు ఇండియా..చైనాలు చాలా గొప్ప దేశాలుగా చెప్పగా.. దీనికి రక్షణమంత్రి థ్యాంక్స్ అని చెప్పటం కనిపిస్తుంది.