Begin typing your search above and press return to search.

ఇందిరాగాంధీ తరువాత ఈమేన‌ట‌

By:  Tupaki Desk   |   3 Sep 2017 12:39 PM GMT
ఇందిరాగాంధీ తరువాత ఈమేన‌ట‌
X
కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ఎలాంటి ప్రాధాన్య‌తా ల‌భించ‌లేదు. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల‌లో తెలంగాణ‌కు ఉన్న ఒక్క మంత్రి ప‌ద‌వి ఊడిపోయింది. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి రాజ్య‌స‌భ‌కు ఎన్నికై కేంద్ర‌మంత్రిగా ఉన్న త‌మిళ‌నాడుకు చెందిన నిర్మ‌లా సీతారామ‌న్ ప‌ద‌వి కూడా పోతుంద‌ని ప్రచారం జ‌రిగింది. ఈమెను కూడా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పిలిచి మాట్లాడారు. దీంతో ఆమె ప‌ద‌వి పోయిన‌ట్లేన‌ని అనుకున్నారు.

త‌మిళ‌నాడులో రాజ‌కీయ సంక్షోభం ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులే బీజేపీ ఎదుగుద‌ల‌కు స‌రైన స‌మ‌య‌మ‌ని, అన్నాడీఎంకె, డీఎంకెల‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్రానికి చెందిన నిర్మ‌లా సీతారామ‌న్ కు బీజేపీ ప‌గ్గాలు ఇచ్చి పంపుతార‌ని అన్నారు. కానీ ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగా ఆమె ప‌ద‌వి పోలేదు స‌రిక‌దా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది.

కేంద్ర కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో నిర్మ‌లా సీతారామ‌న్ కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఏకంగా ర‌క్ష‌ణ‌శాఖ‌ను అప్ప‌గించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ చ‌రిత్ర‌లో దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ మాత్ర‌మే ర‌క్ష‌ణ‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ త‌రువాత ఆ ప‌ద‌వి చేప‌ట్టిన రెండో మ‌హిళ నిర్మ‌లా సీతారామ‌న్. మంత్రిగా న‌రేంద్ర‌మోడీ విశ్వాసం చూర‌గొన్నందునే ఆమెకు ఈ ప‌ద‌వి ద‌క్కింద‌ని చెబుతున్నారు.