Begin typing your search above and press return to search.
గోదావరి తెలివి తేటలు నిర్మలాకు తెలుసా
By: Tupaki Desk | 24 July 2016 10:53 AM GMTఏపీ మొత్తంలో గోదావరి జిల్లాలైన తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పరిస్థితులు భిన్నం. ఈ రెండు జిల్లాలు మెట్ట - డెల్టా ప్రాంతాల కలయికతో ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల పంటలు పండేందుకు ఎక్కువ అస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లాల రైతులు పొగాకును పండిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పొగాకుకు విదేశాల్లో పెద్దగా డిమాండ్ లేకపోవడం - స్థానికంగా భారీ స్థాయిలో ఉత్పత్తులు పెరిగిపోవడంతో మళ్లీ ఈ సాగు విస్తీర్ణం పెరిగితే.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని - మద్దతు ధరలు రాక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. దీంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా సదరు గోదావరి రైతులతో భేటీ అయి.. పొగాకును పండించే నిమిత్తం రైతులకు ఇచ్చిన పర్మిట్ లను వెనక్కు ఇచ్చేయాలని కోరారు. ఇందుకు రైతులు కొన్ని డిమాండ్లు పెట్టడంతో అందుకు ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల ఈ జిల్లాల ప్రజలవి అతి తెలివితేటలంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు.
ఈ సమావేశానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి - ఎంపీ మాగంటి బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ పర్మిట్ లు తిరిగి ఇచ్చి వేయాలంటే పర్మిట్ కు రూ.8 లక్షల చొప్పున మంత్రి నిర్మలాను కోరారు. దీంతో ఒక్కసారిగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. గోదావరి తెలివి తేటలు తనదగ్గర చూపించవద్దంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను అంత ఇవ్వలేనని కరాఖండీగా తేల్చి చెప్పారట.
దీంతో రైతులు మరో అడుగు ముందుకేసి.. పోలవరం ప్రాజెక్టు రైతులకు ఎకరానికి అంతకన్నా ఎక్కవే ఇచ్చారని చెప్పారట. దీంతో మరింత ఆగ్రహానికి గురైన నిర్మలా సీతారామన్.. "ఇదే గోదావరి అతి తెలివి. వారు భూములను కోల్పోయారు. మీ భూములు మీదగ్గరే ఉంటాయి అన్నారట. దీంతో రైతులు చడీ చప్పుడు చేయకుండా మౌనం పాటించారట. ఈ క్రమంలో కలుగజేసుకున్న సుజనా చౌదరి.. కనీసం ఎకరం పర్మిట్ కు రూ. 5 లక్షల వరకన్నా ఇప్పించాలని కోరినట్టు సమాచారం. ఏదేమైనా గోదావరి తెలివితేటలపై ఓ కేంద్ర మంత్రి ఇలా మాట్లాడడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకు ఆమె కూడా పశ్చిమగోదావరి జిల్లా కోడలే (ఆమె భర్త పరకాల ప్రభాకర్ ది నరసాపురం) కావడం గమనార్హం.