Begin typing your search above and press return to search.

తెలుగింటి కోడ‌లు తెలుగోళ్ల‌కు ఏమీ చేయ‌లేదు

By:  Tupaki Desk   |   5 July 2019 11:29 AM GMT
తెలుగింటి కోడ‌లు తెలుగోళ్ల‌కు ఏమీ చేయ‌లేదు
X
బిహార్ వ్య‌క్తి రైల్వేమంత్రిగా ఉంటే బిహార్ కు ఎక్కువ రైళ్లు కేటాయించ‌టం.. త‌మిళ‌నాడు మంత్రి ఎక్కువ‌గా ఉంటే త‌మిళ‌నాడుకు ఎక్కువ రైళ్లు.. బెంగాల్ మంత్రి ఉంటే బెంగాల్ ల‌కు రైళ్లు కేటాయించ‌టం మామూలే. అదే టైంలో ఆర్థిక‌మంత్రి ఏదైనా రాష్ట్రానికి చెందినోళ్లు ఉంటే అంతో ఇంతో త‌మ రాష్ట్రానికి సంబంధించి కేటాయింపులు కాస్త ఎక్కువ‌గా చేసుకోవ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూస్తున్న‌దే.

అలాంట‌ప్పుడు త‌మిళ మూలాల‌తో తెలుగింటి కోడ‌లు కేంద్ర ఆర్థిక‌మంత్రిగా ఉన్న వేళ‌.. రెండు తెలుగురాష్ట్రాల‌కు అంతో ఇంతో లాభం చేకూరుతుంద‌న్న ఆశ పెట్టుకోవ‌టం త‌ప్పేం కాదు. అయితే..అలాంటిదేమీ ఉండ‌ద‌న్న విషయాన్ని తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ్ బ‌డ్జెట్ చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల్ని మోడీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ నెర‌వేర్చింది లేదు.

ఈ బ‌డ్జెట్ లో అయినా అంతో ఇంతో నిధుల కేటాయింపులు జ‌రుగుతాయ‌న్న ఆశ‌లు పెట్టుకున్నారు తెలుగు ప్ర‌జ‌లు. కానీ.. అలాంటి అవ‌కాశం లేద‌న్న విష‌యం తాజా బ‌డ్జెట్ చూస్తే అర్థం కాక మాన‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌భుత్వాల‌కు చెందిన ఆర్థిక‌మంత్రులు సొంతంగా అంతో ఇంతో స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకునే వీలుంది. కానీ.. మోడీ క‌నుస‌న్నల్లో ఉంటార‌న్న ఆలోచ‌న‌తోనే నిర్మ‌ల‌మ్మ‌కు ఆర్థిక‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌న్న ప్ర‌చారం నిజ‌మ‌న్న విష‌యం తాజా బ‌డ్జెట్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.

మోడీ తానేమ‌నుకుంటున్నానో.. అదే రీతిని నిర్మ‌ల‌మ్మ ఫాలో అయ్యారే త‌ప్పించి.. త‌న వ‌ర‌కూ తాను స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేద‌న్న విష‌యం తాజా బ‌డ్జెట్ ను చూస్తే అర్థంకాక మాన‌దు. ఏమైనా.. తెలుగింటి కోడ‌లు తెలుగోళ్ల‌కు ఏమీ చేయ‌ని వైనం చ‌రిత్ర‌లో అలా నిలిచిపోవ‌టం ఖాయం.