Begin typing your search above and press return to search.

దేశ స్వావలంబన..ఇదే 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' లక్ష్యం!!

By:  Tupaki Desk   |   13 May 2020 12:00 PM GMT
దేశ స్వావలంబన..ఇదే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యం!!
X
దేశం మొత్తం ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రజల కష్టాలని తీర్చడానికి - మంగళవారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ .. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీను ప్రకటించారు. చిన్న - మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామని తెలిపారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే , ప్రధాని మోదీ కేవలం ఆర్థిక ప్యాకేజీ మాత్రమే ప్రకటించారు. ఆ 20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ, అలాగే దేశంలో అన్ని వర్గాల ప్రజలకూ ఆ రూ.20 లక్షల కోట్లతో ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో కేంద్ర ఆర్టీకమంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో చెప్పబోతున్నారు. దీనితో అందరూ ఆమె ప్రకటన కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు...........

ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణానికి ఐదు సూత్రాలు

భారత్‌ కు ఒక విజన్‌ ను ప్రధానమంత్రి నిర్దేశించారు, స్వావలంబన భారత్‌ దిశగా దేశం ముందుకెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు , ఆత్మ నిర్బర్‌ భారత్ అంటే స్వయంఆధారితం అని తెలుగులో అర్థం - భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల తో చర్చించాకే ప్యాకేజీ రూపకల్పన జరిగింది. భూమి - కార్మికరంగం - మద్యం - న్యాయవ్యవస్థ - ద్రవ్యతలు కీలకం కానున్నాయి. ఐదు పిల్లలపై ఆత్మ నిర్భయ భారత్ ను నిర్మించాలి అనుకుంటున్నాం

ఆత్మనిర్భర్ భారత్ ప్రధాన లక్ష్యం ఇదే

స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పేరు రావాలి. భారత్‌ కు పీపీఈలు మాస్కులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. అలాగే లాక్‌ డౌన్ సమయంలో రైతులకు నేరుగా నగదు బదిలీ చేయడం జరిగింది. భారత్ ఇప్పుడు మిగులు విద్యుత్ దేశంగా విరాజిల్లుతోంది. వివిధ రంగాల వారితో చర్చించాకే ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

లబ్ధిదారులకు నేరుగా రూ.52వేల కోట్లు నగదు బదిలీ ...

ముఖ్యంగా ల్యాండ్ - లేబర్ - లిక్విడిటీ - లా వైపే ప్రధాన ఫోకస్ ఉంటుంది. అలాగే MSMEల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది అని - ప్రతి సంకట సమయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించింది అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దివాలా కోడ్ ..జీఎస్టీ వంటివి తీసుకొచ్చాం అని - లాక్ డౌన్ తరువాతనే గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించాం. 41 కోట్ల జన్ ధన్ అకౌంట్స్ లోకి ..రూ. 52 ,606 కోట్ల ను జమచేసాం. 71 వేల టన్నుల ఆహార ధాన్యాన్ని అందించాం. రూ.18వేల కోట్లు ట్యాక్స్ పేయర్లకు రీఫండ్ చేయడం జరిగింది. దీనివల్ల 14 లక్షల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరింది

చిన్న - మధ్య తరహా కంపెనీలకి రూ. 3 లక్షల కోట్లు!

నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశం ఉపాధి. ఉద్దీపన చర్యల్లో భాగంగా ౧౫ చర్యలు ప్రకటిస్తున్నాం. చిన్న - మధ్య తరహా కంపెనీలకు మూడు లక్షల కోట్ల కేటాయింపు. MSME రుణాలకి కేంద్రం గ్యారెంటీ. MSMEలకు ఉచితంగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది 45లక్షల యూనిట్లకు ఇది మేలు చేకూరుస్తుంది. 6 రంగాలకు 6 సహాయక చర్యల. 40 రోజుల్లోనే భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది.

పూచీకత్తు లేకుండా చిన్న పరిశ్రమలకు లోన్లు!

MSMEలకు రూ.3లక్షల కోట్లు కేటాయింపు - ఫండ్ ఆఫ్ ఫండ్స్ సూక్ష్మ మధ్యతరహా సంస్థలకు 50 వేల కోట్లు కేటాయింపు - ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ. 10వేల కోట్లు కేటాయింపు - పూచీకత్తు లేకుండా చిన్న పరిశ్రమలు లోన్లు . ఏడాదిపాటు లోన్లపై మారటోరియం - 45 లక్షల కంపెనీలకు లబ్ధి. బ్యాంకులకు cgtnsc క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. MSME సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కావడానికి తోడ్పాటు.అక్టోబర్ 31 లోపు రుణాల పంపిణీ పూర్తి. నాలుగేళ్ల గడువుతో ఎమ్మెస్ ఎంపీలకు రుణాలు. మొదటి పది నెలల పాటు రుణాల చెల్లింపులపై మారటోరియం. 100 క్రెడిట్ గ్యారంటీ రుణాలు. చిన్న పరిశ్రమలకు లోన్ ల పై అదనపు చార్జీలు ఉండవు.

200 కోట్ల వరకు టెండర్లలో విదేశీ కంపెనీలకు అనుమతి లేదు ..

మైక్రో యూనిట్లకు పెట్టుబడులు రూ.1 కోటి వరకు పెంచుతున్నాం. మైక్రో యూనిట్లకు ఇకపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటుంది. చిన్న పరిశ్రమలకు లోన్ ల పై అదనపు చార్జీలు ఉండవు. రూ. 200 కోట్ల వరకు టెండర్లలో విదేశీ కంపెనీలకు అనుమతి లేదు. విదేశీ కంపెనీలకు అనారోగ్య పోటీని తట్టుకునేందుకు చర్యలు - ఆత్మ నిర్భర్ ఇండియాకు మేకిన్ ఇండియా కు తోడ్పడుతుంది. ఈ చర్యల ద్వారా ఎంఎస్ ఎంఈ సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకుంటాయి. నవభారత నిర్మాణమే మన లక్ష్యం.


సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలకు భారీ ఊరట ..ఈపీఎఫ్ కోసం రూ.25వేల కోట్లు కేటాయింపు

సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలకు ప్రభుత్వ విభాగాల నుంచి బకాయిలు లేకుండా చూస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలకు 45 రోజుల్లో పేమెంట్. 2020 వరకు చిన్న సంస్థలు తమ ఉద్యోగుల కోసం పిఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల వాటా కంపెనీల వాటా పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుంది. దీని విలువ 2,500 కోట్లు. దీంతో మూడు లక్షల 65 వేల కంపెనీలకు 72 లక్షల 22వేల మంది ఉద్యోగులకు ఊరట కలుగుతుంది. దీనితో రానున్న మూడు నెలలకు ఉద్యోగస్తులు 10శాతం మాత్రమే పీఎఫ్ కట్టాల్సి ఉంటుంది

విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు రూ.94 వేల కోట్లు..!

NBFc - HFC - MFIలు నిలదొక్కుకునేందుకు రూ.30వేల కోట్లు కేటాయింపు. డిస్కమ్‌ లకు ప్రత్యేక చర్యలు - వీటి కోసం రూ.90వేల కోట్లు కేటాయింపు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కంల బకాయిల కోసం 94 వేల కోట్లు..కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తేనే డిస్కమ్లకు రుణాలు.. జెన్ కోలో - డిస్కమ్ లకి రాయితీ ఇస్తే వినియోగదారుడికి మేలు జరుగుతుంది అని - అలాగే విద్యుత్ ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది అని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి.

ప్రభుత్వ కాంట్రాక్టర్లకు మరో 6 నెలల పాటు పొడిగింపు ...

ఆరు నెలల వరకు కేంద్రం పరిధిలోని సంస్థల్లో కాంట్రాక్టుల పొడగింపు. రైల్వేలు - రోడ్లు - హైవేల నిర్మాణం - కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగానికి ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టర్లకు పాక్షిక బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి.

ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట ... టీడీఎస్ నుంచి 25శాతం మినహాయింపు

ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట - ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్ నుంచి 25శాతం మినహాయింపు. 25శాతం తగ్గింపుతో పన్ను కట్టేవారికి రూ.50వేల కోట్లు లబ్ది. ఈ తగ్గింపులు రేపటి నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు అవుతాయి. దీని ఫలితంగా అందుబాటులోకి రూ . 50 వేల కోట్ల లిక్విడిటీ. వ్యాపారవేత్తలు - వృత్తి నిపుణులు - స్వచ్ఛంద సంస్థలు - సహకార సంఘాలకు పెండింగ్ రిఫండ్ సత్వర చెల్లింపు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 2019 - 20 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు ఈ ఏడాది నవంబర్ 30 కి పొడిగింపు.