Begin typing your search above and press return to search.
నిర్మలమ్మ ప్రెస్ మీట్ కు అరగంట ముందు అలాంటి సీన్
By: Tupaki Desk | 4 Sep 2022 5:22 AM GMTతెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ గురించి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఎత్తులు.. పైఎత్తులు వేసుకోవటమే కాదు.. రాజకీయంగా పైచేయి సాధించేందుకు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రాజుకున్న రాజకీయ వేడి.. అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ అధికారపక్షానికి అసలు సిసలు ప్రత్యర్థి ఎదురయ్యారన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తనకు ధీటుగా నిలిచే రాజకీయ పార్టీలేవీ ఉండకూడదన్న కేసీఆర్ అత్యాశ.. ఇవాల్టి బీజేపీకి కారణంగా చెబుతున్నారు.
ఏ కండీషన్ లో అయినా కంట్రోల్ చేసే అవకాశం ఉన్న కాంగ్రెస్ ను ప్రతిపక్షం స్థానం నుంచి మాయమయ్యేలా చేసేందుకు పావులు కదిపిన కేసీఆర్.. బీజేపీ విషయంలో ఆయన వేసుకున్న అంచనాలు వమ్ము అయినట్లుగా చెబుతారు. తాజాగా ఉప్పు.. నిప్పు మాదిరి ఉన్న టీఆర్ఎస్ - బీజేపీల మధ్య రాజకీయ వాతావరణం మరో స్థాయికి వెళ్లే పరిణామం తాజాగా చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు రావటం.. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరగటమే కాదు.. కేంద్ర నిధులతో పంపిణీ చేసే రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవటాన్ని తప్పు పడుతూ ఆమె జిల్లా కలెక్టర్ ను నిలదీసిన వైనం సంచలనంగా మారింది.
దీనిపై అధికార టీఆర్ఎస్ సైతం స్పందించి కేంద్ర మంత్రి తన హద్దులు దాటినట్లుగా మండిపడింది. ఇలాంటి వాడివేడీ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మీడియా మీట్ ప్రారంభం కావటానికి సరిగ్గా అరగంట ముందు తెలంగాణ అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ.. టీ న్యూస్.. తెలంగాణ టుడే మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లను బీజేపీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ సందర్భంగా అనవసరమైన ప్రశ్నలు వేసి.. మీడియా సమావేశాన్ని పక్కదారి పట్టించే వ్యూహంలో ఉన్న వారిని నిలువరించేందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ తీరు చూస్తే.. ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం తెలంగాణలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.