Begin typing your search above and press return to search.
ఏపీ ఖాతాలోని అప్పు రూ.2,49,435 కోట్లు!
By: Tupaki Desk | 26 Jun 2019 5:00 AM GMTఆంధ్రప్రదేశ్ ఖాతాలోని అప్పు అక్షరాలా రూ.2,49,435 కోట్లు అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. సంవత్సరాల వారీగా ఏపీ అప్పు పెరిగిన వైనాన్ని కూడా ఆమె సభలో వివరించారు.
ఉమ్మడి ఏపీ విభజన పూర్తి అయ్యాకా.. 2015 మార్చి నాటికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.1,48,743 కోట్లు ఉండగా అది 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి బడ్జెట్ అంచనాల మేరకు రూ.2,49,435 కోట్లుగా పెరిగిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
సంవత్సరాల వారీగా... 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.2,01,314 కోట్ల అప్పు ఉండగా - వడ్డీ చెల్లింపులు రూ.12,292 కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పు రూ.2,25,234 కోట్లకు చేరుకోగా వడ్డీ చెల్లింపు రూ.14,756 కోట్లు. 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి అప్పు రూ.2,49,435 కోట్లు - వడ్డీ చెల్లింపు రూ.15,077 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.