Begin typing your search above and press return to search.

ర‌ఫేల్ డీల్: చ‌చ్చిన గుర్రాన్ని మ‌ళ్లీ కొడుతున్నారు

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:02 PM GMT
ర‌ఫేల్ డీల్: చ‌చ్చిన గుర్రాన్ని మ‌ళ్లీ కొడుతున్నారు
X
ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం అధికారంలోని బీజేపీని ముప్పు తిప్ప‌లు పెడుతోంది. ఫ్రాన్స్ వ‌ద్ద 36 ర‌ఫేల్ యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే వాటి త‌యారీ కోసం హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌ కు కాకుండా అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ డిఫెన్స్‌కు అప్ప‌గించార‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా - ర‌ఫేల్ డీల్ అంశంలో ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స‌మాంత‌ర సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు ఓ ఆంగ్ల ప‌త్రిక ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే.

అయితే ఆ రిపోర్ట్‌ ను ర‌క్ష‌ణ మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఖండించారు. ఇవాళ లోక్‌స‌భ‌లో ఆమె మాట్లాడారు. దురుద్దేశంతో ఆ రిపోర్ట్‌ ను ప్ర‌చురించార‌న్నారు. ర‌ఫేల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌న్నారు. ర‌క్ష‌ణ‌శాఖ పంపిన నోటీసుకు.. అప్ప‌టి ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ బ‌దులు ఇచ్చార‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌శాంతంగా ఉండాల‌ని, అన్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతున్నాయ‌ని ఆ లేఖ‌లో పారిక‌ర్ తెలిపార‌న్నారు. రిపోర్ట్‌ను ప్ర‌చురించ‌డం అంటే చ‌చ్చిన గుర్రాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ కొట్ట‌డ‌మే అన్నారు. ర‌ఫేల్ అంశంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘాన్ని ఏర్పాటు చేయాల‌ని విప‌క్షాలు చేస్తున్న డిమాండ్ ఆమె తోసిపుచ్చారు.

అయితే, ఈ వివాదం ఇక్క‌డే మ‌రో మ‌లుపు తిరిగింది. హిందూ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నాన్ని ర‌క్షణ మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఖండించి. ర‌క్షణ‌శాఖ పంపిన నోటీసుకు.. అప్పటి ర‌క్షణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ బ‌దులు ఇచ్చార‌ని వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. అయితే, మ‌రో మీడియా సంస్థ మ‌రిన్ని డాక్యుమెంట్లు బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఏఎన్ఐ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి స్పంద‌న అనంత‌రం మ‌రికొన్ని డాక్యుమెంట్లను బయటపెట్టింది. ఈ ప‌త్రాల్లోని 5వ పేరాలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. డీల్ కు సంబంధించి ఫ్రెంచ్ సమ్మిట్ కు లో జరిగిన విషయాలు అప్ప‌టి ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి పారిక‌ర్ ప్రస్తావించారు. `ఇంకా ఏమైనా ఉంటే పీఎంఓతో మాట్లాడుకొండి` అని లేఖలో స్పష్టం చేశారు. ఈ విషయం బయటపడటంతో ప్రభుత్వం పరువు పోయినట్లైంది. అంతుకుముందు రక్షణ మంత్రి రఫేల్ డీల్ విషయంలో పీఎంఓ జోక్యమే లేదని చెప్పి...తీరా లేఖలో మాత్రం ఇతర విషయాలు పీఎంఓతో మాట్లాడుకొండి అని సూచించటం తీవ్ర దూమారం రేపుతోంది. హిందు కథనంతో పాటు ఏఎన్ఐ బయట పెట్టిన డాక్యుమెంట్లు ప్రభుత్వాన్ని పీకల్లోతు కష్టాల్లోకి తోచివేస్తున్నాయని అంటున్నారు. అయితే, ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు తెలుగింటి వారి కోడలైన నిర్మ‌లా సీతారామన్ చెమ‌టోడుస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.