Begin typing your search above and press return to search.

ర‌క్ష‌ణ మంత్రి రాజీనామా చేయాల్సిందే: స‌్వామి

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:06 AM GMT
ర‌క్ష‌ణ మంత్రి రాజీనామా చేయాల్సిందే: స‌్వామి
X

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు - ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. నిత్యం త‌న వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం ఆయన ప్ర‌త్యేక‌త. స్వ‌ప‌క్షం - ప్ర‌తిప‌క్షం - త‌న‌ - మ‌న తార‌త‌మ్యాలు లేకుండా.....నిర్మొహ‌మాటంగా వ్యాఖ్యానించ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. తాజాగా, ఈ ఫైర్ బ్రాండ్.....సాక్ష్యాత్తూ కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రిం జమ్మూ క‌శ్మీర్ లోని షోపియాన్ లో సైన్యం కాల్పులు జ‌ర‌ప‌డంతో ముగ్గురు పౌరులు మరణించిన ఘటనలో మేజర్‌ ఆదిత్యకుమార్ పై చట్టపరమైన చర్యల తీసుకోవ‌డంపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే విధించింది. ఈ నేపథ్యంలో సీతారామ‌న్ పై స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొద్ది రోజుల క్రితం....కశ్మీర్ షోపియాన్‌ జిల్లాలోని గోవాంపురాలో సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా, సైన్యం నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించి దౌర్జ‌న్యం చేశారు. దీంతో, వారిని చెద‌ర‌గొట్టేందుకు సైన్యం కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో, ఈ ఘటనకు సంబంధించి మేజర్ ఆదిత్యాకుమార్ పై కశ్మీర్ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేప‌ట్టాల‌ని జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబా ఆదేశించారు. దాంతోపాటు, ఆ ఘ‌ట‌న‌పై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా సైన్యాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.

అయితే, మేజర్ ఆదిత్యాకుమార్ పై కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేబట్టడాన్ని ఆదిత్యాకుమార్ తండ్రి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఆ సమయంలో తన కుమారుడు అక్క‌డ‌ లేడని ఆదిత్య తండ్రి కోర్టుకు తెలిపారు. అతడిపై నమోదైన కేసును కొట్టివేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఒక ఆర్మీ మేజ‌ర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తుందని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో రెండు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వెంటనే రాజీనామా చేయాల‌ని స్వామి డిమాండ్ చేశారు. సైన్యంపై కేసు పెట్టడం అర్ధం పర్ధం లేని నిర్ణ‌య‌మ‌ని, సైన్యంపై మెహ‌బూబా ఆంక్ష‌లు విధించ‌డం స‌రికాద‌ని, ఆమె ఇటువంటి ప‌నులు చేయ‌డం మానుకోవాల‌ని స్వామి సూచించారు.

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్డీటీవీ చీఫ్ ప్రణయ్ రాయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖను రాశారు. ఆయన తమ చానల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ చానల్ అమెరికాలోని ప్రముఖ చానల్స్ గా ఉన్న జీఈ - ఎన్బీసీల నుంచి అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని అన్నారు.

ప్రస్తుతం సీఎన్ ఎన్ అధ్యక్షుడిగా ఉన్న అప్పటి ఎన్బీసీ సీఈఓ జెఫ్ జుకర్ తో పాటు - జీఈ సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ లకు మీడియా రంగంలో ఎంతటి పేరు వుందో అందరికీ తెలిసిందేనని, సుబ్రహ్మణ్య స్వామి ఏం ప్రయోజనాలు ఆశించి ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను ఇమ్మెల్ట్ - జుకర్ లను ఎన్నో మార్లు కలుసుకున్నానని, ప్రధాని హోదాలో మీరు కూడా కలుసుకున్నారని గుర్తు చేస్తూ - స్వామి వ్యాఖ్యలు ఇండియాలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని ప్రణయ్ రాయ్ హెచ్చరించారు.