Begin typing your search above and press return to search.

బ్యాంకుల్ని భ్రష్టు పట్టించింది వారిద్దరేనన్న నిర్మలమ్మ

By:  Tupaki Desk   |   17 Oct 2019 6:19 AM GMT
బ్యాంకుల్ని భ్రష్టు పట్టించింది వారిద్దరేనన్న నిర్మలమ్మ
X
సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పటివరకూ ఎవరూ వేలెత్తి చూపని ఇద్దరు ప్రముఖులపై ఆమె నేరుగా ఫైర్ అయ్యారు. బ్యాంకులు భ్రష్టు పట్టిపోవటానికి ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరించిన రఘురామ్ రాజన్ లు కారణమంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదంటూ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలమ్మ భర్త పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో.. ఆయన మాటలకు సరైన రీతిలో కౌంటర్ ఇవ్వని ఆమె.. మాజీ ప్రధాని.. ఆర్ బీఐ గవర్నర్ గా వ్యవహరించిన వీరిద్దరిపైనా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు బ్యాంకులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి వారే కారణమన్నారు.

భారత్ బ్యాంకుల గురించి మాట్లాడుతున్న రాజన్ తన హయాంలో గడ్డు పరిస్థితులకు ముందు సమాధానం చెప్పాలన్న నిర్మలమ్మ.. ప్రస్తుతం బ్యాంకులకు పునర్జీవనం కల్పించటమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. రాజన్ హయాంలోనే మొండి బకాయిల సమస్య తీవ్రమైందన్నారు.

మన్మోహన్ హయాంలో ఫోన్ కాల్ తో కూడా రుణాలు ఇచ్చే వారన్న మాట ఆమె నోటి నుంచి రావటం గమనార్హం. బ్యాంకుల పరిస్థితి రాత్రికి రాత్రి అత్యవసర పరిస్థితి ఏర్పడుదు కదా? అని ప్రశ్నించిన ఆమె.. ప్రస్తుత పరిస్థితికి కారణం గత ప్రభుత్వాలేనని చెప్పటం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకులకు మూలధన అవసరాల కోసం కేంద్రం రూ.70వేల కోట్ల అప్ ఫ్రంట్ కేటాయింపులతో పాటు.. 10 బ్యాంకుల విలీనం ద్వారా నాలుగు బడా బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వైనం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. నిర్మలమ్మ నోటి నుంచి గతంలో కీలక స్థానాల్లో ఉన్న వారి నిర్ణయాలే తాజా పరిస్థితికి కారణమని చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి.. దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్.. రఘరాజన్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.