Begin typing your search above and press return to search.

నిర్మ‌లా వ్యాఖ్య‌లు మోడీకి లాభ‌మా? న‌ష్ట‌మా?

By:  Tupaki Desk   |   30 Sep 2018 9:34 AM GMT
నిర్మ‌లా వ్యాఖ్య‌లు మోడీకి లాభ‌మా? న‌ష్ట‌మా?
X
స‌మ‌స్య‌లో చిక్కుకున్న తేలిగ్గా బ‌య‌ట‌కు రావ‌టం కుద‌ర‌దు. అందులోనా చిక్కుముడిలో చిక్కుకున్న‌ప్పుడు అందులోని నుంచి లాఘ‌వంగా బ‌య‌ట‌కు రావాలే త‌ప్పించి.. తొంద‌ర‌ ప‌డ‌కూడ‌దు. అంతేనా.. కార్న‌ర్ అయిన‌ప్పుడు ఉన్న తెలివి కూడా ఎక్క‌డికో వెళ్లిపోతుంది. అలాంటి సంద‌ర్భంలో వ‌చ్చే మాట‌ల‌తో మ‌రింత చిక్కుల్లో ప‌డిపోవ‌టం ఖాయం. తాజాగా కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తీరు అలానే ఉంద‌ని చెప్పాలి.

రాఫెల్ మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు విరుచుకుప‌డుతున్నా.. ఆ ఇష్యూ మీద మాట్లాడేందుకు మోడీ అండ్ కో అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితుల్లో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి సంచ‌ల‌నంగా మారారు కేంద్ర రక్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.

తాజాగా ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడిన మాట‌లు హాట్ టాపిక్ గా మారాయి. రాఫెల్ డీల్ విష‌యంలో ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. నిర్మ‌ల చేసిన వ్యాఖ్య‌లు వాటిని బ‌ల‌ప‌ర్చేవిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అనిల్ అంబానీకి చెందిన రిలియ‌న్స్ డిఫెన్స్ పేరును మోడీ ప్ర‌భుత్వ‌మే చెప్పింద‌న్న హోలాండ్ ఆరోప‌ణ‌పై స్పందిస్తూ.. నిజ‌మో కాదో తెలీదు.. కానీ ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడిపై ఓ ఆరోప‌ణ ఉంది. అది నిజం కావ‌చ్చు.. కాక‌పోవ‌చ్చు.. ఆయ‌న స‌తీమ‌ణి కొన్ని నిధులు తీసుకున్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.. అందుకే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు అలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నిర్మ‌ల మాట‌ల్ని విన్న వారంతా.. ఇప్ప‌టివ‌ర‌కూ మేం చెప్పేది కూడా అదే క‌దా? అనేసుకుంటున్న ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కూ రాఫెల్ మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ప్ర‌తిప‌క్షాల కుట్ర‌గా అభివ‌ర్ణించే మోడీ బ్యాచ్ కు భిన్నంగా నిర్మ‌లా చేస్తున్న వ్యాఖ్య‌లు విప‌క్షాల‌కు కొత్త ఆయుధంగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చూస్తే.. మోడీ మ‌రింత డిఫెన్స్ లో ప‌డేలా నిర్మ‌లా తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.