Begin typing your search above and press return to search.

నిర్మలా సీతారామన్‌ కు షాక్‌

By:  Tupaki Desk   |   12 Nov 2015 7:14 AM GMT
నిర్మలా సీతారామన్‌ కు షాక్‌
X
సాంకేతిక మంత్రం జ‌పిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి ఇపుడు అదే సౌల‌భ్యం స‌మ‌స్య‌గా మారింది. టెక్నాల‌జీ వ‌ల్ల‌ వ‌చ్చిన విప‌రిమాణాల్లో ఒక‌టైన హ్యాకింగ్ ఇపుడు కోర‌లు విప్పి ప్ర‌భుత్వ అకౌంట్ల‌ను హ్యాక్ చేసే స్థాయికి ఈ క్ర‌మంలో కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు షాక్ త‌గిలింది.

నిర్మ‌ల అధికార ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌ కు గురైంది. మంత్రికి చెందిన అధికార ట్విటర్‌ హ్యాండిల్‌- @CimGOI అనే ట్విటర్ అకౌంట్ హ్యాక్ చేశారు. ఓ ఉత్పత్తి తాలూకు ప్రచారం కోసం ఆ ట్విటర్‌ ను ఎవరో హ్యాక్ చేసి అక్క‌డ ప్రోడ‌క్ట్ గురించిన వివ‌రాలు పోస్ట్ చేశారు. అయితే నిర్మలా సీతారామన్‌ అనుయాయులు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని చేరవేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన నిర్మ‌లా ట్విటర్‌ హ్యాకింగ్‌ ను తాము పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కొంత సమయం తరువాత ఆ ప్రచార ప్రకటనను ట్విటర్‌ నుంచి తొలగించారు.