Begin typing your search above and press return to search.
అవును.. రక్షణ మంత్రి రోడ్ల మీద నడిచారు
By: Tupaki Desk | 4 Jan 2018 9:37 AM GMTగ్రామ సర్పంచ్ అయినా సరే.. .హడావుడి.. హంగు లేకుండా బయటకు రాని పరిస్థితి. అలాంటిది ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మాటలా. ఆ స్థానంలో ఉన్న వారు బయటకు వస్తే ఎంత భద్రత..? మరెంత భారీ ఏర్పాట్లు ఉంటాయి. మరి.. అలాంటిది సాదాసీదా సామాన్యుడి మాదిరి.. పక్కన మరో నలుగురితో కలిసి రోడ్ల మీద నడవటమా..? అది కూడా ఎలాంటి సెక్యురిటీ లేకుండా? సాధ్యమేనా? అంటే.. నో అనేస్తారు.
కానీ.. అలా అనకుండా ఉండటానికి ఒక పారీకర్.. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉదాహరణగా నిలుస్తున్నారు. తాజాగా ఆమె వీధుల్లో తిరిగిన వైనం వైరల్ గా మారటమే కాదు.. అందరి మదిని దోచుకుంటున్నారు. కేంద్రరక్షణ మంత్రి హోదాలో ఉన్న నిర్మలా సీతారామన్ ఈ మధ్యన బెంగళూరుకు వెళ్లారు.
అక్కడ ఆమె ఒక సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ మందిరానికి.. దానికి దగ్గర్లోని ఒక హోటల్ కు భారీ కాన్వాయ్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అనుకున్నారేమో? ఆమె వడివడిగా వీధిలోకి వచ్చేశారు. ఆమెతో పాటు నలుగురైదుగురు సిబ్బంది ఉన్నారు. రోడ్డు మీద నడుస్తున్న ఆమెతో సెల్ఫీ తీసుకోవటానికి ఒకరు ముచ్చట పడితే ఓకే అనేశారు. సిగ్నల్ దగ్గరకు రాగానే స్పీడ్ పెంచేశారు.
ఒకదశలో చిన్నపాటి పరుగు పెట్టారు. వడివడిగా రోడ్డు దాటేసిన ఆమె.. అక్కడున్న హోటల్ చంద్రికకు భోజనం చేయటానికి వెళ్లారు. ఈ ఉదంతాన్ని అక్కడున్న మీడియా షూట్ చేయటం.. అది కాస్త వైరల్ గా మారింది. సామాన్యమైన వ్యక్తిగా రోడ్డు మీద నడవటంపై అక్కడున్న టీవీ విలేకరి చెబితే.. నిర్మలా వెంట ఉన్న ఒకరు సామాన్యుడి పాలన ఇదేనంటూ బదులివ్వటం కనిపించింది. అయితే.. వీటిని పట్టించుకోని నిర్మలా సీతారామన్ తన దారిన తాన నడుచుకుంటూ వెళ్లారు. ఈ వైరల్ వీడియో చూసినోళ్లంతా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.