Begin typing your search above and press return to search.
ఈసారి నిర్మలా డ్రాగన్ కే షాకిచ్చారు
By: Tupaki Desk | 8 Oct 2017 10:22 AM GMTధైర్యంగా దూసుకెళ్లే తత్త్వం తనకు ఎక్కువన్న విషయాన్ని కేంద్రరక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ ఇప్పటికే చెప్పేశారు. కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్ కు వెళ్లటమే కాదు.. రక్షణపరంగా కీలక వ్యూహాత్మకమైన లేహ్.. లడఖ్.. సియాచిన్ ప్రాంతాల్లో పర్యటించి తనలో ధైర్యం పాళ్లు ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
రక్షణమంత్రిగా అరుదైన అవకాశం దక్కించుకున్న నిర్మలా సీతారామన్ తాజాగా తనదైన శైలిలో వ్యవహరించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ మధ్యన భారత్.. చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం ప్రాంతాన్ని సందర్శించటం ద్వారా నిర్మలా సీతారామన్ పొరుగున ఉన్న చైనాకు షాకిచ్చేలా చేశారు.
డోక్లాం.. సిక్కింలలో పర్యటిస్తున్న ఆమె నాథూలా పాస్ ను సైతం సందర్శించారు. ఆ సమయంలో సరిహద్దు కంచె దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె ట్వీట్ రూపంలో వెల్లడించారు.
తన తాజా పర్యటనలో సిక్కిం.. అరుణాచల్ ప్రదేశ్ లోని కీలక ప్రాంతాల్ని సందర్శించారు. ఇండో.. టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారులతో భేటీ అయిన ఆమె తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. డోక్లాంకు తాజాగా దేశ రక్షణ మంత్రే స్వయంగా వచ్చి సందర్శించటం చైనా ఏమాత్రం ఊహించని పరిణామంగా చెప్పక తప్పదు.