Begin typing your search above and press return to search.
నిషిత్-రవివర్మ మృత్యువులోనూ వీడని బంధం
By: Tupaki Desk | 10 May 2017 10:48 AM GMTఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22)తో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ(23) మృతిచెందిన ఘటన ఎందరినో కలిచి వేస్తోంది. ఈ ఇద్దరు ఆప్తమిత్రులు. మృత్యువులోనూ వారివురూ స్నేహబంధం వీడలేదు. నిషిత్, రవివర్మ క్లాస్‌మేట్స్. అదికాస్తా ప్రాణ స్నేహంగా మారింది. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, రాజా రవివర్మ చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండేవారు. దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు రోడ్డు ప్రమాదంలోనూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. రవివర్మ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. వ్యాపారవేత్త కామని బాల మురళీకృష్ణ కుమారుడు రాజ రవివర్మ.
నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-36లో ఈ తెల్లవారుజామున 3 గంటలకు వీరు ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ ఎస్‌యూవీ బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ యువకులు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించేలోపే యువకులు మృతిచెందారు. సమాచారం తెలిసిన నారాయణ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఏడాదే నిషిత్ నారాయణ గ్రూప్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సంస్థ డైరెక్టర్ గా పని చేస్తున్న నిశిత్ టాప్ ర్యాంకులతో సంస్థ ప్రతిష్టను నిలబెట్టారు. సింగపూర్ లో బీబీఏ కోర్సు చదువుతున్న సమయంలో కూడా వారంలో రెండు రోజులు నారాయణ విద్యాసంస్థల బాధ్యతలు చూసేవారు. ప్రతి వారం రీజియన్ల వారీగా సమావేశాలు నిర్వహించేవారు.