Begin typing your search above and press return to search.
నిషిత్ కారు స్పీడ్ 205 కాదు..146 మాత్రమేనట!
By: Tupaki Desk | 27 May 2017 4:40 AM GMTవాయు వేగంతో కారును నడుపుతూ మెట్రో ఫిల్లర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణం చెందటం తెలిసిందే. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమన్నది ప్రాధమికంగా తేల్చినప్పటికీ.. ప్రమాద సమయంలో కారు వేగం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు కారు స్పీడ్ మీటర్ దగ్గర ముల్లు 206 కిలోమీటర్ల దగ్గర నిలిచిపోయిన నేపథ్యంలో.. నిషిత్ కారు గంటకు 206 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. నిషిత్ కారు ప్రమాదం జరిగినప్పుడు రికార్డు అయిన సీసీ పుటేజ్ ను సాంకేతికంగా అధ్యయనం చేస్తున్నారు. తాజాగా అధ్యయనం ప్రకారం.. ప్రమాదానికి గురైన నిషిత్ కారు వేగం గంటకు 146 కిలోమీటర్ల మేర ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ప్రమాదం జరిగిన కారు స్పీడో మీటర్ ముల్లు 206 కిలోమీటర్ల వేగం వద్ద ఆగిపోవటం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం రావటం లేదు.
విచారణ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నిషిత్ ప్రమాదాన్ని సాంకేతికంగా అధ్యయనం చేయగా అతడి కారు గంటకు 146 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా నిర్ధారించినట్లుగా చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిషిత్ కారు ఎంత వేగంగా వెళుతుందన్న విషయానికి వస్తే.. సాధారణంగా ఒక కారు ప్రయాణించే వీడియోను ఫ్రేమ్ ల వారీగా విడగొడితే ఒక సెకన్ కు 24 ఫ్రేమ్ లు రావాల్సింది.. కేవలం నాలుగు ఫ్రేమ్ లే వచ్చినట్లుగా చెబుతున్నారు. కారు ఎంత వేగంగా వెళుతుందన్న విషయాన్ని ఫ్రేమ్ లు కూడా సమాధానాన్ని చెప్పేస్తాయన్న మాటను నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నిషిత్ కారు ఎంత స్పీడ్ లో ప్రమాదానికి గురైందన్న ప్రశ్నకు.. అధికారుల తాజా సమాధానమైతే గంటకు 146 కిలోమీటర్ల వేగంగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/