Begin typing your search above and press return to search.
నీతా అంబానీ టీ కప్పు ఎంత కాస్ట్లీ అంటే
By: Tupaki Desk | 4 July 2016 10:30 PM GMTనీతా అంబానీ... భారతదేశంలోని అత్యంత కాస్ట్లీ లేడీస్ లో ఒకరైన ఆమె లైఫ్ స్టైల్ అడుగడుగునా వారి స్థాయిని చెప్పకనే చెబుతుంది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ భార్యగా ఆమె వ్యాపారంలోనూ పేరొందిన వ్యక్తి. ఒక క్రికెట్ టీంకు ఓనర్.. నిత్యం వ్యాపార వ్యవహారాలు - పార్టీలు - మీటింగుల్లో ఉండే ఆమె లైఫ్ స్టైల్ యమ కాస్ట్లీగా ఉంటుందట. ఎంత కాస్ట్లీ అంటే ఆమె పొద్దున్నే తాగే కాఫీ రేటు ఏకంగా రూ.3 లక్షల విలువ చేస్తుంది. అదొక్కటే కాదు - ఆమె వాడే ప్రతి వస్తువూ ఖరీదైనదే.
నీతా అంబానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ పైకి కోటిన్నర ఖర్చు చేసి బంగారు - ప్లాటినం - డైమండ్ టేబుల్ వేర్ ఏర్పాటు చేశారట. అంతేకాదు... ఆమె టీ తాగే కప్పు ఖరీదు ఏకంగా 3 లక్షల విలువ చేస్తుందట.
అలాగే నీతా కట్టే వాచీలు మామూలుగా ఉండవు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలే ఆమె చేతిని అలంకరిస్తాయి. బల్గరీ - రాడో - గుక్కి - కాల్విన్ క్లెయిన్ - ఫాజిల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల వాచీలు వాడుతారు. ఇక ఆమె హ్యాండ్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్నెల్ - గోయార్డ్ - జిమ్మీ చూ వంటి బ్రాండ్లవే వాడుతారు. వాటిలో ప్రారంభ ధరే 40 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక చెప్పుల గొప్పల్లోకి వస్తే... ఆమె ఒకసారి వేసిన చెప్పుల జత రెండోసారి వేయరట. అలా అని అవేమీ వందలు - వేల ధరల్లో ఉండేవి కావు.. అన్నీ లక్షల ఖరీదు చేసేవే. ఆమె వాడే ఏ బ్రాండయినా కూడా మినిమం లక్ష రూపాయలు ఉంటుందట.