Begin typing your search above and press return to search.
ఇంత నిరసనల్లోనూ ఈ మాటలేంది గడ్కరీ సాబ్?
By: Tupaki Desk | 23 Dec 2019 6:45 AM GMTఎలాంటి కుంభ కోణాలు బయటకు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు లేవు. అంతా బాగుంది.. అప్పుడప్పుడు మోడీ మాష్టారు తనకు తానుగా కెలుక్కునే పౌరసత్వ చట్ట సవరణ.. ఎన్నార్సీ లాంటివి తప్పించి మోడీ మాస్టారికి తిరుగులేదన్నట్లుగా ఉన్న పరిస్థితి.
పాలనా పరంగా ఎలాంటి లోపాలు లేనట్లుగా ఉన్నా.. ఆర్థిక మందగమనం దేశాన్ని ఎందుకు పట్టి పీడిస్తుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. మాంద్యం అన్న మాట జోరుగా వినిపిస్తున్నా.. దానికి కారణం ఏమిటన్న దానికి మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కేంద్రం ఎదుర్కొంటున్న ద్రవ్య కొరత నేపథ్యంలో కేంద్రంమంత్రి తీసుకున్ననిర్ణయం ఆసక్తికరంగా మారింది.
తన ఇంటికి అధికారుల్ని పిలిపించిన ఆయన.. దాదాపు రూ.89వేల కోట్లకు సంబంధించి కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. వీటి కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి రాబడి రావటం లేదన్నారు. ఏం చేస్తారో చేయండి.. ఏం చేయాలో మాత్రం తాను చెప్పనని.. ఆర్థిక పరిస్థితి పుంజుకునేలా.. ద్రవ్య కొరతను అధిగమించేలా చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కోరటం ఆసక్తికరంగా మారింది.
తాను చేసినపనిని గడ్కరీ దాచుకోకుండా బయటకు చెప్పటం ద్వారా.. దేశంలో ద్రవ్య కొరత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే తెలియక మానదు. అయితే.. ఈ వ్యాఖ్యలన్ని వ్యూహాత్మకంగా చేసినవన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యను తెర మీదకు తీసుకురావటం ద్వారా చర్చను మరో వైపునకు తీసుకెళ్లాలా గడ్కరీ మాటలు ఉన్నాయా? అన్నది ప్రశ్న.
పౌరసత్వ సవరణ చట్టం.. ఎన్నార్సీల మీద ఇప్పటికే భారీగా చర్చ జరిగి.. పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటున్న వేళ.. తాము తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు గడ్కరీ. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పాక్.. బంగ్లాదేశ్.. అఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా వచ్చిన ముస్లింలు తిరిగి వెళ్లటానికి చాలానే దేశాలు ఉన్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని.. వాటిల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చన్నారు.
అదే సమయంలో పాక్.. బంగ్లా.. అఫ్ఘన్లలో వివక్ష.. హింసకు గురి అవుతున్న మైనార్టీలకు భారత్ తప్పించి మరే దేశం లేదన్నారు. ఓపక్క దేశ వ్యాప్తంగా ఎన్నార్సీపై తాము చర్చించలేదని.. ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ చెబుతుంటే.. మరోవైపు కేంద్రమంత్రి గడ్కరీ అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం దేనికి నిదర్శనం?